Agnipath Scheme: 


ఇవే మార్పులు..


అగ్నిపథ్ స్కీమ్‌లో భారీ మార్పులు చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది. శిక్షణ పొందిన వారిలో  25% మందిని రెగ్యులర్ క్యాడర్‌లో తీసుకుంటామని గతంలో ప్రకటించింది. కానీ...ఇప్పుడా సంఖ్యని 50%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏజ్ క్రైటేరియాని కూడా 23 ఏళ్లకు పెంచింది. ఆర్మీలో సైనికుల బలం తగ్గకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్లాన్ చేసుకుంటోంది. అయితే...ఇక్కడో సమస్య ఎదురవుతోంది. ఏవియేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అగ్నివీరులను సెలెక్ట్ చేయడం కష్టతరమవుతోంది. ఆ పోస్ట్‌కి తగ్గ అర్హతలు ఎవరికీ ఉండడం లేదు. ప్రస్తుతానికి దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. 2026 నాటికి అగ్నివీర్ ద్వారా 1.75లక్షల మంది యువతను ఆర్మీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  2021లో  పార్లమెంట్‌లోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌పై చర్చ జరిగింది. నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో తగినంత సిబ్బంది లేరని తేలింది. గతేడాది జూన్ 16వ తేదీన అగ్నిపథ్ స్కీమ్‌ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా దీనిపై అల్లర్లు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు యువకులు. ఆర్మీలో యువతీ యువకుల సంఖ్య పెంచేందుకే ఈ స్కీమ్‌ని తీసుకొచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. వచ్చే నాలుగైదేళ్లలో 50-60 వేల మందిని అగ్నిపథ్ స్కీమ్ కింత రిక్రూట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా ఈ సంఖ్యని 90 వేల నుంచి లక్ష వరకూ పెంచే అవకాశాలున్నాయి. ఏటా 60 వేల మంది సైనికులు రిటైర్ అవుతున్నారు. వీళ్ల స్థానాన్ని భర్తీ చేసేందుకే ఈ అగ్నిపథ్‌ స్కీమ్‌ని తీసుకొచ్చారు. 


ఇదీ స్కీమ్..


 అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, డిఫెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఉపశమన చర్యలు ప్రకటించింది కేంద్రం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన సైనికులను రాష్ట్ర పోలీసు బలగాలలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, అగ్నిప్రమాదాలకు పాల్పడిన వారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అప్లికేషన్‌ల ప్రక్రియ మొదలైన వెంటనే భారత వాయుసేనలో ఖాళీలకు 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ గతేడాది జూన్‌ 24న ప్రారంభం అయింది. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై భారత నౌకా దళం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ నేవీలోకి తీసుకునే ఫస్ట్ బ్యాచ్ అగ్నివీరుల్లో 20 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేవీకి చెందిన వివిధ ప్రాంతాల్లో వీరిని రిక్రూట్ చేస్తామని పేర్కొంది. 


Also Read: పాకిస్థాన్ మహిళ ఇండియా కుర్రాడు, ఈ పాన్ వరల్డ్ లవ్‌స్టోరీలో ఎన్ని ట్విస్ట్‌లో