Letter War Between Kharge And Dhankhar : ఎంపీల సస్పెన్షన్ (MPs Suspension) అంశం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖఢ్ (Jagadeep Dhankhar ), కాంగ్రెస్ అధ్యక్షుడు ( Congress Chief) మల్లికార్జున ( Mallikarjuna Kharge ) మధ్య లేఖల యుద్ధానికి (Letter War )దారి తీస్తోంది. క్రిస్మస్ రోజు తన ఇంటికి రావాలని ఆహ్వానిస్తూ జగ్‌దీప్ ధన్‌ఖఢ్ రాసిన లేఖపై స్పందించారు. ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లికార్జున ఖర్గే ప్రతి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సస్పెన్షన్‌ను బీజేపీ ఆయుధంగా మార్చుకుందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పార్లమెంట్ వ్యవహారాలను ఆయుధంగా మార్చుకుందని అన్నారు. ఎంపీల సస్పెన్షన్‌ను అనుకూల సాధనంగా మార్చుకున్నట్లయితే, ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నట్లు అర్థమవుతోందని ఖర్గే విమర్శించారు. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. సభలో లేని ఇండియా కూటమి సభ్యుడిపై బహిష్కరణ వేటు వేయడంపై మల్లికార్జన ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే ఉభయసభల నుంచి భారీ సంఖ్యలో సభ్యులను సస్పెన్షన్ చేశారని ఆరోపించారు. ఇలాంటివన్నీ ఛైర్మన్ విచక్షణాధికారాల కిందకు వస్తాయని స్పష్టం చేశారు.
అంతకుముందు ఏం జరిగిందంటే...
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సోమవారం తన ఇంటికి రావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆహ్వానించారు. తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినా...ఈ సమావేశం జరగకపోవడాన్ని ఆయన గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. మల్లికార్జున ఖర్గేను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదన్న ధన్‌ఖడ్, మీతో నేరుగా చర్చల ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నట్లు లేఖలో ప్రస్తావించారు. క్రిస్మస్ రోజు కుదరకపోతే మరో రోజైన రావొచ్చని ధన్‌ఖడ్ తెలిపారు. జగధీప్ ధన్‌ఖడ్‌తో సమావేశాన్ని మల్లికార్జున ఖర్గే తిరస్కరించారు. ఈ విషయం తనను ఎంతో ఆవేదననకు గురి చేసిందని చెప్పడంతో మల్లికార్జున ఖర్గేకు మరో లేఖ రాశారు. తాజాగా జగదీప్ ధన్‌ఖడ్ లేఖకు ఖర్గే సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో యువత పొగ వెదజల్లిన వెంటనే బీజేపీ ఎంపీలు బయటకు పారిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ లోకి యువత ఎందుకు ప్రవేశించారనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశమని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతోనే యువత పార్లమెంట్ లోకి వచ్చి నిరసనకు దిగారని అన్నారు. ఉపాధి గురించి మాట్లాడని మీడియా, ఎంపీల రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినపుడు, కనీసం నోటీసుల్లో ఏముందో చదవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కార్ ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మండిపడ్డారు. పార్లమెంటులో విపక్ష సభ్యులను బహిష్కరించడాన్ని తప్పు పట్టారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని చట్టబద్ధమైన డిమాండ్ చేసినందుకు వేటు వేశారని సోనియా గాంధీ విమర్శించారు. గతంలో ఎన్నడూ కూడా పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష ఎంపీలను ఇలా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు.
Also Read:వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి నిజమే- నేవీ క్లారిటీ, ఐసీఏఎస్ విక్రమ్ సాయంతో ముంబయి పోర్టుకు తరలింపు
Also Read: కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం, ఇక చట్టాలుగా - ప్రత్యేకత ఏంటో తెలుసా?