NATA 2024 Examination: దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (National Aptitude Test in Architecture-NATA)- 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (Council of Architecture) విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. నాటా ప్రవేశ పరీక్షను 2006 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తూ వస్తోంది. అయితే అయిదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షా విధానంలో ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ ఈసారి పలు కీలక మార్పులు చేసింది. 


ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జులై వరకు ప్రతి శని, ఆదివారాలు NATA పరీక్ష నిర్వహిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ ఈ విధానాన్ని అమలుచేయనుంది. ఈ మేరకు కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ తాజాగా సమాచార పత్రం (NATA - 2024 Brochure) విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా మూడు సార్లు నాటా రాసుకోవచ్చు. అందులో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. అభ్యర్థులు పొందిన స్కోర్‌కు రెండేళ్ల పాటు గుర్తింపు ఉంటుంది. అంటే ఇప్పుడు పొందిన స్కోర్‌తో 2024-25 విద్యాసంవత్సరంలో గానీ, 2025-26లో గానీ సీటు పొందొచ్చు. పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు మార్చి 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌, ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.


వివరాలు..


➦ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)- 2024


కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్


కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు. 


అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ) విద్యార్హత ఉన్నవారు ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్ పరీక్షలకు హాజరుకాబోతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


పరీక్ష ఫీజు వివరాలు..




దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం..


➥ మొత్తం 200 మార్కులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. హిందీ. ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.


➥ పార్ట్-ఎ డ్రాయింగ్ & కంపోజిషన్ టెస్ట్-80 మార్కులకు ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. వీటిలో కంపోజిషన్ & కలర్ (ఎ1)-1 ప్రశ్న-25 మార్కులు, స్కెచింగ్ & కంపోజిషన్ (బ్లాక్ & వైట్)(ఎ2)-1 ప్రశ్న- 25 మార్కులు, 3D కంపోజిషన్ (ఎ2)-1 ప్రశ్న- 30 మార్కులు ఉంటాయి. 


➥ పార్ట్-బిలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 45 ప్రశ్నలకుగాను 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 మార్కులవి-30 ప్రశ్నలు (బి1)-60 మార్కులు, 4 మార్కులవి-15 ప్రశ్నలు(బి2)-60 మార్కులు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌లో 2 కేంద్రాలను, తెలంగాణలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.03.2024.


➥ పరీక్ష ప్రారంభ తేది: 06.04.2024.


NATA-BROCHURE-2023


Website