2012లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్, అప్పటి భారత ఎన్నికల కమిషనర్ (CEC) ఎస్.వై. ఖురేషీతో ‘నేను ఆత్మహత్య చేసుకుంటాను..’ అని అన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై కొందరు మంత్రులు చేసిన అర్థరహిత వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన ఖురేషీ, తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన తరువాత ఈ ఘటన జరిగింది. అంతేకాకుండా, ‘ఈసీ కేవలం భారత కీర్తి కిరీటమే కాదు, దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. ఒకవేళ మనం దాన్ని కోల్పోతే, సర్వస్వం కోల్పోయినట్లే’ అని మాజీ ప్రధాని మన్మోహన్ అప్పటి సీఈసీ ఖురేషీతో అన్నారు.

Continues below advertisement

సల్మాన్ ఖుర్షీద్‌తో మొదలైన వివాదంఈ ఆసక్తికరమైన సంభాషణను ఖురేషీ తన విడుదల కానున్న బుక్ ‘ఇండియా అండ్ ఐ: ఏ హండ్రెడ్ మెమోరీస్, నాట్ ఏ మెమోయిర్’లో ప్రస్తావించారు. తన పుస్తకంలో, మాజీ ఎన్నికల కమిషనర్ మాజీ ప్రధాని మన్మోహన్ ను ఒక ఉన్నతమైన నాయకుడిగా పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌కు రాజ్యాంగబద్ధమైన మర్యాదలు కేవలం ప్రసంగాలకే పరిమితం కాదని, ఆయన ప్రవర్తన, ఆలోచనలలో అంతర్భాగం అన్నారు. 

ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 2012లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఒక ఎన్నికల ర్యాలీలో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలలో ముస్లిం రిజర్వేషన్లను 4.5 శాతం నుండి 9 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు.

Continues below advertisement

కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు

దీనిపై ఖురేషీ ఇలా పేర్కొన్నారు. ‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఎన్నికల నియామకవళి అమలులోకి వచ్చాక ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకూడదు. ఇది స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని బీజేపీ వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.‘మేము న4 రోజుల పాటు దీనిపై విచారణ జరిపాం. కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ తమ వాదనల్ని వినిపించారు. ఇద్దరు ప్రముఖ లాయర్లు.. ఎన్నికల హామీలకు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి మధ్య గీత ఎక్కడ గీయాలనే అంశంపై ఆలోచిస్తున్నారు. చివరకు ఎన్నికల సంఘం ఖుర్షీద్‌ను తప్పుబడుతూ అభిశంసించింది’ అన్నారు.

Also Read: Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కామెంట్లు

ఎన్నికల నియామకవళి ప్రకారం కమిషన్‌ తీసుకున్న అత్యంత కఠినమైన చర్య ఇదేనని జూలై 2010 నుండి జూన్ 2012 వరకు సీఈసీగా పనిచేసిన ఖురేషీ పేర్కొన్నారు. ఈసీ తీసుకున్న ఈ చర్యపై ఖుర్షీద్ అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం అహంకారపూరితంగా లేదా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది. దీనిపై ఖురేషీ పుస్తకంలో ఇలా రాశారు. ‘విమర్శలు నన్ను ఇబ్బంది పెట్టవు. కానీ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా పరోక్షంగా చేసే వ్యాఖ్యలు నన్ను కలవరపెట్టాయి. ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు’.

ఈద్ పండగ సందర్భంగా తన నివాసంలో ఖురేషీ వార్షిక మిలన్ వేడుకను ఏర్పాటు చేశారు. అతిథులలో అప్పటి ప్రధాని ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖరే కూడా ఉన్నారు. సంభాషణల మధ్య ఖురేషీ తన అసంతృప్తిని ఆయనకు తెలిపారు. "నేను ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌కు చెప్పాలా?" అని హరీష్ ఖరే అడగ్గా, ‘నేను మీకు ఈ విషయం అందుకే చెప్తున్నానని’  ఖురేషీ సమాధానమిచ్చారు. మరుసటి రోజు ఖురేషీ ‘ర్యాక్స్’ (రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎక్స్ఛేంజ్) ఫోన్ మోగగా.. అవతలి వైపు నుండి, "ప్రధాని మీతో అత్యవసరంగా మాట్లాడాలనుకుంటున్నారు" అని చెప్పారు. మన్మోహన్ సింగ్ లైన్లోకి వచ్చారు. ఆయన గొంతులో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఖురేషీ గారూ, నేను మిమ్మల్ని వెంటనే కలవవచ్చా? అని మన్మోహన్ అడిగారు.

నేను ఆత్మహత్య చేసుకుంటా: మన్మోహన్ సింగ్ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు చూస్తే ఆయనే స్వయంగా తనను కలవడానికి వచ్చేలా ఉన్నారు. ‘సర్, మీరు దేశ ప్రధాని. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తానని చెప్పాను. ఆ రోజు రాత్రి 7 గంటలకు మీటింగ్ ఖరారైంది. సాయంత్రం ఖురేషీ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ‘మన్మోహన్ సింగ్ స్వయంగా తలుపు వద్ద నా కోసం వేచి చూస్తున్నారు. నన్ను లోపలికి తీసుకువెళ్లారు. మేం ఇంకా సరిగ్గా కూర్చోకముందే, ఆయన అత్యంత బాధతో.. ‘మీరు అన్న మాటల్ని హరీష్ నాకు చెప్పారు. ఒకవేళ మీరు కూడా అలాగే భావిస్తే, నేను ఆత్మహత్య చేసుకుంటానని’ మన్మోహన్ అన్నారు. ఇది విని తాను ఒక్కసారిగా షాకయ్యారని ఖురేషీ తన బుక్ లో రాశారు.

తన ఫిర్యాదు కేవలం కొందరు మంత్రుల గురించేనని, మన్మోహన్ సింగ్ గురించి కాదన్నారు. ఖురేషీ ప్రకారం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ఎన్నికల సంఘాన్ని దేశ కీర్తిగా, దేశం సాఫ్ట్ పవర్‌గా అభివర్ణించేవారు. ఖురేషీకి తన ఉద్దేశాలపై అనుమానం కలిగిందనే ఊహను కూడా అప్పటి ప్రధాని తట్టుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ఆయనతో, ‘ఒకవేళ ఈ విషయం నాకు తెలిసి ఉంటే, నేను వారిని తీవ్రంగా మందలించేవాడిని. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే, కేవలం ఫోన్ చేసి నాతో మాట్లాడండని’ చెప్పారు.

Also Read: CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్

ఈసీ మన ప్రజాస్వామ్యానికి ఆత్మ: మన్మోహన్ సింగ్‘ఎన్నికల సంఘం కేవలం భారత కీర్తి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యానికి ఆత్మ. దీనిని మనం కోల్పోతే, అన్నింటినీ కోల్పోయినట్లే’ అని మన్మోహన్ అన్న మాటల్ని ఖురేషీ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తననుకదిలించిందని పేర్కొన్నారు.  దానికి కారణం రాజ్యాంగబద్ధమైన మర్యాదలు కేవలం ప్రదర్శన కోసం కాకుండా, తన ప్రవర్తనలో, ఆలోచనలలో అంతర్భాగం చేసుకున్న ఒక గొప్ప నాయకుడిని తాను చూశానన్నారు. 

ఖురేషీ ఈ సంభాషణల వివరాలను అప్పటి పీఎం ప్రధాన కార్యదర్శి టి.కె.ఎ. నాయర్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌లకు తెలిపారు. హరీష్ ఖరే కూడా తన మిత్రులతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సమావేశం తర్వాత ఈసీపై వస్తున్న విమర్శలు పూర్తిగా ఆగిపోయాయని ఖురేషీ తెలిపారు.