'free movement' in Manipur:శనివారం (మార్చి 8, 2025) మణిపూర్‌లో ఫ్రీ ట్రాఫిక్ ఉద్యమం ప్రారంభమైంది. దీంతో కుకి, మెయిటీ ప్రాబల్య ప్రాంతాల్లో హింస చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఫ్రీ ట్రాఫిక్ ఉద్యమాన్ని నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు అధికారులు బస్సులు నడపడం ప్రారంభించారు. కుకి ప్రాబల్యం ఉన్న జిల్లాలోని నిరసనకారులు ఆ ప్రక్రియకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు.  

కుకి కమ్యూనిటీ ప్రజల నిరసన   భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక నిరసనకారుడు మరణించాడు. 25 మంది గాయపడ్డారు. శనివారం ఇంఫాల్, చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, బిష్ణుపూర్ రోడ్లపై బస్సులు నడిపారు. వెంటనే కుకి కమ్యూనిటీ ప్రజలు రోడ్లపైకి వచ్చి వాటిని అడ్డుకున్నారు. ఫ్రీ మూమెంట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.  

Also Read: చావా సినిమా ప్రభావం- ఔరంగజేబు నిధి కోసం కోటను తవ్వేస్తున్న జనం- నిజంగానే బంగారం ఉందా?

పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం అంతర్ జిల్లా బస్సు సర్వీసులు ప్రారంభమైన వెంటనే గామ్గిఫై ప్రాంతంలో ఒక గుంపు వెళ్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు జనసమూహాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించాయి. లాఠీఛార్జ్ చేశాయి. వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టి నిరసనకారుల నుంచి 114 ఆయుధాలు, ఐఇడి గ్రెనేడ్లు,  వెపన్స్‌ స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో, రాష్ట్రంలో జరిగిన వేర్వేరు దాడుల్లో నిషేధిత సంస్థలకు చెందిన ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు.

ఫ్రీ మోమెంట్‌ను ప్రకటించిన అమిత్ షా మణిపూర్ పరిస్థితిపై మార్చి 1న, హోంమంత్రి అమిత్ షా హోంమంత్రిత్వ శాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రోడ్లపై రాకపోకలు జరిగేలా చూడాలని హోంమంత్రి ఆదేశించారు. రోడ్లను దిగ్బంధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో చురచంద్‌పూర్ జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు ఇంఫాల్ నుంచి ప్రయాణికులు లేకుండా బయల్దేరాయని, వాటితో పాటు కేంద్ర బలగాల పెద్ద కాన్వాయ్ వెళ్లిందని అధికారులు తెలిపారు.

చురచంద్‌పూర్ వెళ్తున్న బస్సు బిష్ణుపూర్ జిల్లా మీదుగా ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కాంగ్వాయి చేరుకుంది. NH-2 (ఇంఫాల్-దిమాపూర్ హైవే)లో, నిరసనకారులు టైర్లు తగలబెట్టి, రాష్ట్ర ప్రభుత్వ వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్లపై గుమిగూడారు. ఇలా ఎక్కడిక్కడ గుమ్మిగూడిన జనాలను తప్పిస్తూ బస్‌లు నడిపే ప్రయత్నం అధికారులు చేశారు. ఈ క్రమంలో నిరసనకారుడు మృతి చెందగా పాతిక మంది గాయపడ్డారు. 

Also Read:మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు.. భద్రతా, టీకాలు అందించడంతో