Manipur Violence: 


శాంతి భద్రతలు అదుపులోకి..? 


మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ ఘర్షణలు జరుగుతున్న క్రమంలో మొత్తం రాష్ట్రాన్ని "disturbed area"గా ప్రకటించింది. శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...రాష్ట్రంలో 19 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో తప్ప మిగతా అన్ని చోట్లా Armed Forces Special Powers Act (AFSPA) అమలు కానుంది. అక్టోబర్ 1 నుంచి ఆర్నెల్ల పాటు ఇది అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. 


"కొంత మంది పదేపదే హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న క్రమంలోనే సాయుధ బలగాలను మొహరించాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలపై నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఇక్కడ AFSPA కొనసాగుతుంది. గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపారు."


- మణిపూర్ ప్రభుత్వం






AFSPA లేని ప్రాంతాల్లో ఇంఫాల్ కూడా ఉంది. నిజానికి ఇక్కడే ఎక్కువగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కానీ..ఇక్కడ మాత్రం ఆ బలగాలను మొహరించడం లేదు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రహోం శాఖ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ AFSPA ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన తరవాతే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని గతంలోనే అమిత్‌షా ప్రకటించారు. కానీ...మణిపూర్‌లో హింస పెరుగుతుండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ కూడా కీలక ప్రకటన చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి హింసను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. 


విద్యార్థుల హత్య..


మణిపూర్‌ మండుతూనే ఉంది. అక్కడ మొదలైన హింసాకాండకు అడ్డుకట్ట పడటంలేదు. మణిపూర్‌ మారణహోమానికి ఇప్పటికే ఎంతో అమాయులు బలైపోయారు. ఇద్దరు  మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన... యావత్‌ దేశాన్నే కదిలించింది. అక్కడ జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టింది. అయితే... కొద్దిరోజులుగా మణిపూర్‌లో  పరిస్థితులు చక్కబడుతున్నాయని వచ్చాయి. మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కూడా పునరుద్దరించింది అక్కడి ప్రభుత్వం. అయితే... ఇప్పుడు మరో ఇద్దరు విద్యార్ధుల  హత్య.. కలవరం రేపుతోంది. జులైలో కిడ్నాపయిన ఇద్దరు విద్యార్థులను చంపేసిన ఫొటోలు.. సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మైతీ తెగకు చెందిన 17ఏళ్ల హిజామ్‌ లింతోయింగంబి, 20ఏళ్ల ఫిజామ్  హెమ్‌జిత్‌ జులై నుంచి కనిపించడం లేదు. వారు కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అయితే... తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో  ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు విద్యార్థులు అటవీ ప్రాంతంలోని ఓ క్యాంపులో కూర్చుని ఉండగా... వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  సాయుధుల చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. మరో ఫొటోలో ఇద్దరు విద్యార్థులు చనిపోయి పడి ఉన్నారు. హెమ్‌జిత్‌ తల నరికేసి ఉన్నారు. వీరిద్దరినీ హత్య చేసినట్టు  ఫొటోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 


Also Read: రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక