Stunt On Moving Train:  కిటికీ పక్కన కూర్చుకుని ఫోన్ చూసుకుంటున్న ప్రయాణికుడి నుంచి ఫోన్ కొట్టేయాలనుకుంటే..అతను  అ చేయిని గట్టిగా పట్టుకుంటాడు. ట్రైన్ కదిలి పక్క స్టేషన్ లో ఆగే వారికి ఆ దొంగను అలా కిటికీకి వేలాడదీసి దీసుకెళ్తాడు ప్రయాణికుడు. మరోసారి కిటీకీలో చేయి పెట్టి దొంగతనం చేయాలంటేనే భయపడిపోయేలా ట్రీట్ మెంట్ అది. అచ్చంగా అలాంటిదే రియల్ గా జరిగింది. 

వేగంగా దూసుకుపోతున్న రైలు కిటికీ బయటి వైపున ఒక యువకుడు వేలాడుతూ కనిపించిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వ్యక్తి రైలులో ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కిందపడబోయాడు. అయితే అతి కష్టం మీద మరొక ప్రయాణీకుడు అతన్ని పట్టుకున్నాడు. అసా అచని పట్టుకుని వేలాడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

లింక్ లో వీడియో చూడవచ్చు. 

అలా కొంతసేపు ప్రయాణించిన తర్వాత రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది . ఆ వ్యక్తి చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.  రైలు ఆగకపోతే లేదా ఆ వ్యక్తి వేగంగా దూసుకుపోతున్న రైలు నుండి పడి ఉండేవాడు. స్టంట్ ప్రయత్నాలతో ప్రాణం పోయి ఉండేది. 

ఈ ఘటనఉత్తరప్రదేశ్ లో జరిగింది.  రైలు కాస్‌గంజ్ నుండి కాన్పూర్‌కు వెళ్తోంది. కిటికీలను పట్టుకుని ఓ వైపు నుంచి మరో వైపు వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగింది. ఎలాగోలా ప్రాణం నిలబెట్టుకుని బతుకుజీవుడా అంటూ రైలెక్కాడు.ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణకు ఆదేశించారు.  

పోలీసులు అతను అసలు ఆ కిటీకి వద్దకు ఎందుకు వెళ్లాడు.. స్టంట్స్ చేయడానికా లేకపోతే దొంగతనం చేయడానికా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.  ఆ యువకుడికి ఏమైనా నేర చరిత్ర ఉందా లేదా అన్నదానిపై రికార్జులు పరిశీలిస్తున్నారు. ఉత్తరాదిలో చాలా మంది అల్లర, చిల్లరగా తిరిగే యువత రీల్స్ కోసం ఇలా రైళ్ల వద్ద అడ్డగోలు స్టంట్స్ చేసి ప్రాణాల మీదుక తెచ్చుకుంటూ ఉంటారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగడం లేదా.. ఎక్కడం వంటి స్టంట్లు చేసి.. ప్రమాదాలకు గురవుతూంటారు. 

గతంలో ఇలాగే ముంబైలోని ఓ లోకల్ ట్రైన్ లో  యువకుడు స్టంట్స్ చేస్తూ వీడియోలు తీశాడు. అతని వీడియోలు కొన్ని రోజుల తర్వాత వైరల్ అయ్యాయి.  పోలీసులు అతని అడ్రస్ పట్టుకుని వెళ్లారు.  వారి ఇంటికి వెళ్తే పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఆ యువకుడికి ఓ కాలు, ఓ చేయి తీసేసి ఉంది. రైల్లో  స్టంట్ చేయచోయి ప్రమాదానికి గురవడం వల్ల ఆ కాలు చేయి పోయినట్లుగా గుర్తించారు. ఇలంటి చిల్లర పనులు చేసేవారందరూ ఆ కుర్రాడికి జరిగిన ఘోరమైన డ్యామేజీని చూసి బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. అయితే ఇలాంటివి ఎన్ని జరిగినా సరే కొంత మంది ఆకతాయిలు ఇలాంటి  స్టంట్లు చేస్తూనే ఉన్నారు. దానికి యూపీలో జరిగిన ఈ ఘటనే ఉదాహరమ అనుకోవచ్చు.