Maharashtra NCP Crisis:
పక్కకు తప్పుకోవాలా..?
మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. శరద్ పవార్ రిటైర్ అవ్వరా..? అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ఉండదని తేల్చి చెప్పారు. ఆయన చెప్పినంత మాత్రాన శరద్ పవార్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని ప్రశ్నించారు.
"అజిత్ పవార్ చెప్పినంత మాత్రాన శరద్ పవార్ వెంటనే రిటైర్ అయిపోతారా..? అయినా ముసలితనం రాగానే పక్కకు తప్పుకోవాలా..? రాజకీయాల్లో రిటైర్‌మెంట్ అనేదే ఉండదు"
- లాలూ ప్రసాద్ యాదవ్, RJD చీఫ్
అజిత్ పవార్ వ్యాఖ్యలు..
ఇటీవలే అజిత్ పవార్ ముంబయిలో తన మద్దతుదారులతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలోనే శరద్ పవార్‌కి చురకలు అంటించారు. 83 ఏళ్లు వచ్చినా ఇంకా పాలిటిక్స్ ఎందుకని సెటైర్లు వేశారు. ఒక్కో రాజకీయ పార్టీలో రిటైర్‌మెంట్ ఏజ్ ఉంటుందని, మీకు ఇంకా ఆ వయసు రాలేదా అని ప్రశ్నించారు.
"అందరి ముందు నన్ను విలన్‌ని చేశారు. అయినా మీపై (శరద్ పవార్‌ని ఉద్దేశిస్తూ) నాకు ఇంకా గౌరవం ఉంది. కానీ నాకో విషయం చెప్పండి. IAS ఆఫీసర్‌లు కూడా 60 ఏళ్లు రాగానే రిటైర్ అయిపోతారు. ఇక పాలిటిక్స్ విషయానికొస్తే..బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్‌మెంట్ ఉంటుంది. ఎల్‌కే అద్వాణి, మురళీ మనోహర్ జోషిని చూసే ఉంటారుగా. వాళ్లు అలా రిటైర్ అయ్యారు కాబట్టే బీజేపీలో కొత్త వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. అదే విధంగా మీరు రిటైర్ అయిపోయి మాకు అవకాశం ఇవ్వండి. ఆశీర్వాదాలూ అందించండి.
- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
సుప్రియా కౌంటర్..
అజిత్ పవార్ కామెంట్స్‌కి సుప్రియా సూలే కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన వయసుపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని తేల్చి చెప్పారు.
"పెద్దలు పిల్లలకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కొందరు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్లు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి..? టాటాకి ఇప్పుడు 86 ఏళ్లు. అమితాబ్ బచ్చన్‌కి 82 ఏళ్లు. వాళ్లు ఇప్పటికీ ఉత్సాహంగా పని చేయడం లేదా?"
- సుప్రియా సూలే, NCP వర్కింగ్ ప్రెసిడెంట్
"వెళ్లిపోయిన నేతల్ని వెనక్కి రప్పించుకుంటాం" అని శరద్ పవార్ చేసిన కామెంట్స్‌తో అజిత్ పవార్ అలెర్ట్ అయ్యారు. తనకు మద్దతునిస్తున్న నేతలందరినీ ముంబయిలోని ఓ హోటల్‌లో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్లు సంతకాలు చేసిన అఫిడవిట్‌లను ఈసీకి సమర్పించారు. జులై 1వ తేదీన అజిత్ పవార్ NCPని వీడారు. అంతకు ముందు రోజే...పక్కా ప్లాన్‌తో అందరితోనూ సంతకాలు చేయించుకున్నారు.
Also Read: Rajasthan News: లవ్ జిహాదీ కాదది, ఇద్దరు లెస్బియన్ల ప్రేమ కథ - మైనర్ బాలికతో పారిపోయిన ఉపాధ్యాయురాలు