Madhya Pradesh Elections:


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు..! 


మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Election) ప్రస్తుతం BJP అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ABP Cvoter Opinion Poll వెల్లడించింది. ఈసారి ఓటర్లు కాంగ్రెస్‌కి అధికారమిచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ పోల్‌లో ఎక్కువ మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్‌కి కాస్త సానుకూలత పెరిగింది. అయితే...చౌహాన్ సర్కార్‌పై ఓటర్లు ఎందుకంత గుర్రుగా ఉన్నారో స్పష్టంగా వివరించింది ఈ ఒపీనియన్ పోల్. ఏయే అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయన్నదీ వెల్లడించింది. 


ఏయే అంశాల ఎఫెక్ట్ ఎంత..?


మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం అంశం 31.0% మేర ప్రభావం చూపించనుందని ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. విద్యుత్, రహదారులు, నీళ్లు లాంటి మౌలిక వసతులు 2.7% మేర ప్రభావం చూపించనున్నాయి. శాంతి భద్రతలతో పాటు మహిళా భద్రత అంశం 3.8% ప్రభావం చూపుతుందని ఈ పోల్‌లో వెల్లడైంది. అవినీతి ప్రభావం 4.9% మేర ఉండే అవకాశముందని తెలిపింది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ 30.5% మేర ఉండనుంది. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య 55.4%గా ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన లేని వాళ్ల సంఖ్య 6.1%గా తేలింది. ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న వాళ్ల సంఖ్య 38.4% గా వెల్లడైంది. ప్రభుత్వ పని తీరుపై 39.1% మంది సంతృప్తిగా ఉన్నారు. పరవాలేదనుకున్న వాళ్ల సంఖ్య 22.5% గా ఉండగా...పూర్తిగా అసంతృప్తిగా ఉన్న వాళ్ల సంఖ్య 37.1% మంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పని తీరుపై 41.0% మంది సానుకూలంగా ఉన్నారు. 20.5% మంది పరవాలేదని చెప్పారు. ఏ మాత్రం సంతృప్తిగా లేని వాళ్ల సంఖ్య 38.0%గా ఉంది. 


ఛత్తీస్‌గఢ్‌ సినారియో..


ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై ( Chhattisgarh Elections) నిరుద్యోగ అంశం 27.7%, మౌలిక వసతుల అంశం ప్రభావం 1.5%గా ఉంది. శాంతిభద్రత సమస్యల ప్రభావం 5.6%, అవినీతి ప్రభావం 6.6%, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌ 36.7%గా ఉంది. ఇతరత్రా సమస్యల ప్రభావం 21.9%గా తేల్చింది ఈ ఒపీనియన్ పోల్. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య 48.5%గా ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం మార్చాలనుకోని వాళ్ల సంఖ్య 6.7%గా ఉంది. ప్రభుత్వానికి సానుకూలంగా 44.8% మంది ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై ఛత్తీస్‌గఢ్ ఓటర్లు 45.4%మేర సానుకూలంగా ఉన్నారు. 31.8% మంది పరవాలేదని చెప్పగా...21.5% మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీకి సానుకూలంగా 29.0% ఓట్లు రాగా...24.7% మంది పరవాలేదని చెప్పారు. రాహుల్‌కి వ్యతిరేకంగా 39.9% మంది ఓటు వేశారు. 


మిజోరంలో ఇలా..


మిజోరంలో నిరుద్యోగం ఎఫెక్ట్ 19.0%, మౌలిక వసతులు 15.7%, శాంతి భద్రతల అంశం 4.1% మేర ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. ప్రభుత్వంపై 50% మంది ప్రతికూలంగా ఉన్నారు. సానుకూలంగా ఉన్న వాళ్ల సంఖ్య 34.3%గా ఉన్నట్టు ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.