అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది.ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. మిగతా 241 మంది ప్రయాణికులు, విమానం కూలిన మెడికల్ కాలేజి క్యాంటీన్ లో ఉన్న వైద్య విద్యార్దులు, సిబ్బందితో కలిపి 260మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించారు. అయితే రుపాని లక్కీ నెంబర్ కు ప్రమాదానికి సెంటిమెంట్ గా భావించే లక్కీ నెంబర్ కొంపముంచిందట.
విజయ్ రూపానికి లక్కీ నెంబర్ 1206. ఈ నెంబర్ కు మాజీముఖ్యమంత్రికి మంచి అనుబంధం ఉంది. ఈ నెంబర్ కోసం ఎదురు చూడటం, ఈ నెంబర్ ఎంత ఖరీదైనా కొనేయడం, ఈ నెంబర్ కలిసొచ్చే సమయానికి పనులు ప్రారంభించడం వంటివి రూపానీకి మొదటి నుండి అలవాటుగా ఉండేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సెంటిమెంట్ తాజాగా భారీ విమాన ప్రమాదంలో రూపాని ప్రాణాలు కోల్పోయేలా చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే..
ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి పేలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలోనే విమానం క్రాష్ అవ్వడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రయాణించడంతో ప్రమాద సమయంలోనే అగ్ని కిలలకు ఆహుతైయ్యారు రూపాని.
ప్రమాదం జరిగిన 12వ తేది, 6వ నెలతో రూపానికి మిస్టీరియస్ కనెక్షన్ ఉందట. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్ అంటున్నారు అతని సన్నిహితులు. అయితే అదే రోజు జూన్ 12న ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఒక్కసారిగా క్రాష్ అవ్వడం , విమానం నుండి భారీగా మంటలు ఎగసిపడటం జరిగింది. ప్రమాదంలో దాదాపు తొంభైశాతం కాలిబూడిదైన ఆ విమానంలో విజయ్ రూపాని సీట్ నెంబర్ కూడా 12 సంఖ్య.
అంతేకాదు 2016 నుండి 2021 వరకు విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదవిలో లేకున్నా ఆయన ఇప్పటికీ బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. రాజకీయాల్లోనూ, వ్యక్తిగతంగానూ రూపానికి 1206 అనే సంఖ్య బాగా కలిసొచ్చింది. దీంతో ఆయన ఫస్ట్ స్కూటీ నెంబర్ ప్లేట్ మొదలు విజయ్ రూపాని దగ్గరున్న అన్నీ కార్లకి 1206 అనే నెంబర్ ఉంటుంది. ప్రమాదం జరిగిన విమానంలో ఎక్కే ముందు బోర్డింగ్ సమయం కూడా 12.10 నిమిషాలు. టికెట్ సీరియల్ నెంబర్, సీట్ నెంబర్ కూడా 12తో మొదలైయ్యింది.ఇప్పుడు చనిపోయిన రోజు కూడా 12తేదీ 06 నెల కావడం ఆశక్తిగా మారింది. యాదృచ్చికంగా జరిగినా ఆయన లక్కీ నెంబర్ రోజునే మరణవార్త వినడం ఇటు అభిమానుల్ని కలచివేస్తోంది.