Maharashtra Ganesh: వినాయక చవితి వేడుకలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. ముంబయిలో గణేషు చతుర్థి వేడుకలు అంబరాన్నంటుతాయి. వీధి వీధిలో, ప్రతి గల్లీకి గణేష మండపాలు వెలుస్తాయి. అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ముంబయిలో గణేష్ చతుర్థి ఉత్సవాల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సవాల్లో పాల్గొంటారు. వినాయక చవితి వచ్చిందంటే.. 11 రోజుల పాటు ముంబయిలో మరో రేంజ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. అత్యంత ఆడంబరంగా నిర్వహించే వేడుకల్లో పాల్గొనడం చాలా సరదాగా, హుషారుగా, ఉత్సాహంగా ఉంటుంది.


భారీ భారీ గణనాథులు కొలువుదీరే మండపాలను ఎవరికి వారు.. వారి, వారి స్థాయిలను బట్టి డెకొరేట్ చేస్తుంటారు. మండపాల నిర్వహణలో పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇతరుల కంటే మన గణనాథుడు పెద్దగా ఉండాలని, వేడుకలు మరో రేంజ్ లో ఉండాలని కోరుకుంటారు. గల్లీ గల్లీకి కొలువుదీరే గణనాథుల మండపాలు.. ఒక్కోటి ఒక్కోలా ఉంటూ విపరీతంగా ఆకట్టుకుంటాయి. 


అయితే.. ముంబయి తూర్పు ప్రాంతంలోని కింగ్స్ సర్కిల్ వద్ద జీఎస్బీ సేవా మండల్ నిర్వహించే వేడుకల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అత్యంత ఆడంబరంగా వేడుకలు నిర్వహిస్తారు. జీఎస్పీ సేవా మండల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని బంగారం, వెండితో ధగధగలాడిపోతున్నాడు. జీఎస్బీ సేవా మండల్ గణనాథుడి అలంకరణ కోసం ఏకంగా 66 కిలోల బంగారాన్ని వాడారు. అలాగే 295 కిలోల వెండిని వాడారు. వాటితో నగలు, కిరీటాలు తయారు చేయించి గణేషుడికి అలంకరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ మెకానిజమ్ లను ప్రవేశపెట్టారు. ధగధగ వెలిగిపోతున్న ఆ గణేషుడిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారం, వెండి నగలతో అలంకరించిన వినాయకుడికి రూ. 360.40 కోట్లతో ఇన్సూరెన్స్ కూడా చేసినట్ల జీఎస్బీ సేవా మండల్ నిర్వాహకులు తెలిపారు. 


గత ఏడాది కూడా జీఎస్బీ సేవా మండల్ నిర్వాహకులు భారీ మొత్తంలో బంగారం, వెండితో అలంకరించారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండితోనే వినాయకుడిని డెకరేట్ చేసినట్లు జీఎస్బీ సేవా మండల్ నిర్వహకులు తెలిపారు.