The Telecommunications Bill 2023 : పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. నేర శిక్షాస్మృతి, సాక్ష్యాధార చట్టం, భారతీయ శిక్షాస్మృతి స్థానాల్లో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ మూడు మూడు నేర శిక్షాస్మృతి బిల్లుల (Criminal Law Bills)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తాజాగా టెలికమ్యూనికేషన్స్ బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. వైర్‌లెస్ టెలీగ్రఫీ యాక్ట్-1993, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885, ది టెలీగ్రఫీ వైర్స్ యాక్ట్ 1950 స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చారు. టెలికమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు అంగీకారం తెలిపారు. లోక్‌సభ ఆమోదం (Loksabha Passes Telecommunications Bill) తెలపడంతో రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడా కూడా ఆమోదం ముద్ర పడితే, రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత చట్ట రూపం దాల్చనుంది.
టెలికమ్యూనికేషన్స్ బిల్లు చట్ట రూపం దాలిస్తే...
టెలికమ్యూనికేషన్స్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సంతకం చేస్తే, చట్టరూపం దాల్చనుంది. ఓటీటీ, ఇంటర్నెట్‌తో నడిచే కాలింగ్, మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్‌వర్క్ అయినా, లేదంటే టెలికమ్యూనికేషన్ సేవలైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. లేదంటే నెట్ వర్క్ సర్వీసులు, టెలికమ్యూనికేషన్ సేవలను నిలిపివేసే అధికారం ఉంటుంది. ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు అనుమానం వచ్చిన సందేశాలు, ఫోన్ కాల్స్ ను రహస్యంగా వినవచ్చు. అవసరం అనుకుంటే వాటి ప్రసారాలను నిలిపివేయవచ్చు. ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇలాంటి అధికారాలు లభిస్తాయి.
దుర్వినియోగపరిచినా నేరమే
దేశ ప్రయోజనాలకు, మిత్ర దేశాలతో ఉన్న సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరిచినా నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి ఉపయోగించే గూగుల్ మీట్,వాట్సప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు ఐటీ చట్ట నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించారు. ఓటీటీ యాప్‌లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉండబోవు. మెసేజ్ ఎన్క్రిప్షన్, డేటా ప్రాసెసింగ్, ఐడెంటిఫికేషన్, ఎనాలసిస్ వంటి అంశాల్లో కొన్ని స్టాండర్డ్స్ చేసే సెట్ చేసే అవకాశాన్ని కేంద్రానికి ఉంటుంది. ప్రభుత్వం సొంతంగా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్‌ని తీసుకురావొచ్చు. వాట్సాప్‌తో పాటు ఇతర ఆన్లైన్ కమ్యూనికేషన్ సర్వీస్‌లు అందిస్తున్న ఎండ్-టు- ఎండ్ ఎన్క్రిప్షన్ సిస్టంతో పాటు ప్రైవేట్ కమ్యూనికేషన్స్ సెటప్‌లో భారీ మార్పులే జరగనున్నాయి.