Lok Sabha Election 2024 Voting Live: లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్ లో 7, బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఘండ్‌లో 3, జమ్ము కాశ్మీర్‌లో 1, లద్దాఖ్‌లో 1 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దేశంలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగుతుండగా ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో ఎన్నికలు జరుగుతుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు.
పోటీలో కీలక నేతలు
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్‌లోని బంగావ్), ఎల్‌జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్) కీలక నేతల ఐదో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటి వరకు నాలుగు దశల్లో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.
పోలింగ్ ప్రారంభం
- బెంగాల్ లోని ఖానాపూర్, ఆరాంబాగ్ ప్రాంతంలో బీజేపీ నాయకుడు రాజ్‌హటి సుష్తైన్‌పై దాడి జరిగింది.
- పోలింగ్ బూతుల్లోకి తమ పార్టీకి చెందిన ముగ్గురు ఏంజెట్లను ఎన్నికల అధికారులు అనుమతించలేదని అమందగా బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు.
- రాయబరేలిలో బీజీపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ ఓటు వేశారు.
- జమ్మూ కశ్మీర్‌లోని నౌగాం బూతుల్లో ఓటర్లు బారులు తీరారు. జేకేఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒహరు అబ్దుల్లా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.
- బాలీవుడ్ హీరో ఫర్షాన్ అక్తర్, దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓటు వేశారు.
- ప్రజస్వామ్య పండుగ అయిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
- ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ వేటు వేశారు.
- లక్నోలోని పోలింగ్ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.