దేశ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన LIC ఐపీఓ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867 దగ్గర లిస్ట్ అయిన ఎల్ఐసీ షేర్లు లక్షలాది మంది మదుపర్లకు నిరాశ మిగిల్చాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్‌ఐసీ లిస్ట్ కావడంతో ప్రతికూల ప్రభావం పడింది. సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన IPO తర్వాత LIC షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.



 







ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ తర్వాత... LIC షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి ₹949 గా నిర్ణయించింది. కానీ.. 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867 దగ్గర ఎల్‌ఐసీ షేర్లు లిస్ట్ కావడంతో ఈ దిగ్గజ బీమా కంపెనీపై ఎంతో నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన వారికి   నిరాశ తప్పలేదు. 







ఇనీషియల్ ఇష్యూ ధర కంటే చాలా తక్కువకు లిస్ట్ అయింది.   ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఆశగా ఎదురుచూసిన మదుపరులు ఎల్‌ఐసీ స్టాక్ రూ.900 నుంచి రూ.949 మధ్యలో అయినా లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాల్లో ఉండగా రూ.867 వద్ద షేర్లు లిస్ట్ కావడంతో నిరాశకు గురయ్యారు.