ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే అడవల్లో రైళ్ల పట్టాల మీద ఎన్ని ఎనుగులు ప్రాణాలు కోల్పోతుంటాయో లెక్కలేదు. రైలు కూతకో భయపడో... రైతు వస్తుందని తెలియకపట్టాలకు అడ్డంగా వెళ్లడం ద్వారానో అవి మృత్యువాత పడుతూ ఉంటాయి. ఇలాంటి ఓ పరిస్థితిని ఓ ట్రైన్ లోకోమోటివ్ డ్రైవర్ చాకచక్యంగా తప్పించారు. ఓ ఏనుగు ట్రాక్ మీదకు వస్తుందని దూరంగా చూసి సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో ఆ ఏనుగు సేఫ్‌గా ట్రాక్ దాటిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఏనుగులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతం కూడా ఒకటి. సిలిగురి నుంచి అలీపూర్ దౌర్ ప్రాంతానికి వెళ్లే రైలు మార్గాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటాయి. అక్కడ ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. ఆ మార్గంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లను రైల్వే శాఖ నడుపుతోంది. ఇలా వెళ్తున్న ఇంటర్ సిటీ రైళ్ల కింద గతంలో పలు ఏనుగులు పడి దుర్మణం పాలయ్యాయి. ఈ సారి మాత్రం ఆ ఏనుగును లోకోమోటివ్ డ్రైవర్ కాపారారు. 


 రాష్ట్రంలో రైల్వే ట్రాక్‌లపై   ఏనుగుల దుర్మరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి ఏనుగులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై తక్కువ వేగంతో రైళ్లు నడిపించాలని.. ఇదే విధంగా అయా ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ వైర్లు అమర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.  రైలు వచ్చిన సమయంలో ఈ సోలార్‌ విద్యుత్‌ వైబ్రేషన్‌ వచ్చేలా చర్యలు చేపట్టాలన్న సూచనలు ఉన్నాయి.  అదేవిధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న రైల్వేట్రాక్‌ సైడ్‌లలో రైళ్లు స్లోగా నడపాలని సూచన బోర్డులు అమర్చాలని కూడా రైల్వే శాఖకు సూచనలు వెళ్లాయి.   ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వన్యపాణి సంరక్షణ అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు సయుక్తంగా అయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ జరపాలని జంతు ప్రేమికులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు.