Cloudburst Hits Jammu and Kashmir: జమ్మూలోని రియాసి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ప్రకృతి వైపరిత్యంతో మహోర్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి, దీని కారణంగా చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు ఏడుగురు వ్యక్తులు అదృశ్యమైనట్లు సమాచారం. అదే సమయంలో, రాంబన్ జిల్లాలోని రాజ్‌గఢ్ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం జరిగింది. ఇక్కడ ముగ్గురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల దెబ్బతిన్నాయి.
బాందీపురా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్
జమ్ముకాశ్మీర్‌లోని బాందీపురా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో శుక్రవారం (ఆగస్టు 26) రాత్రి క్లడ్‌బరస్ట్ ఏర్పడింది. అయితే, ఇందులో ఎవరూ మరణించినట్లు సమాచారం లేదు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని సరిహద్దు గురేజ్ సెక్టార్‌లోని తులేల్ ప్రాంతంలో క్లడ్‌బరస్ట్ సంభవించింది. దీని కారణంగా ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
44 రైళ్లు రద్దు
ఉత్తర రైల్వే ఆగస్టు 30న జమ్మూ, కత్రా ,మరియు ఉధంపూర్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 46 రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మంగళవారం జమ్మూలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా గత నాలుగు రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూలో పలుచోట్ల రైల్వే లైన్లు తెగిపోవడంతో కథువా, ఉధంపూర్‌ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లను రద్దు చేస్తున్నారు. అంతకుముందు, ఉత్తర రైల్వే ఆగస్టు 29న జమ్మూ, కత్రా, ఉధంపూర్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 40 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జమ్మూ వెళ్లనున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ఆదివారం (ఆగస్టు 31) నాడు రెండు రోజుల పర్యటన కోసం ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. వర్షాల కారణంగా 110 మందికి పైగా మరణించారు, వీరిలో ఎక్కువ మంది యాత్రికులు కాగా, మరో 32 మంది గల్లంతయ్యారు. అమిత్ షా మూడు నెలల్లో జమ్మూకి ఇది రెండవ పర్యటన అవుతుంది.
శనివారం తెల్లవారుజామున జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గఢ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను సహాయక సిబ్బంది కనుగొన్నారని అధికారులు వార్తా సంస్థ PTIకి తెలిపారు. గత వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల ఫలితంగా కొండచరియలు విరిగిపడటం, రాళ్ళు పడటం వల్ల అనేక నష్టాలు సంభవించిన కారణంగా రాజౌరిలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) ప్రస్తుతం మూసివేశారు.
"మొఘల్ రోడ్డు నుండి వచ్చే అన్ని వాహనాలకు సలహా ప్రకారం కటాఫ్ సమయం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత మేము ఏ వాహనాలను వెళ్లడానికి అనుమతించలేదు. వసతి, ఆహారం కోసం ప్రయాణీకుల వాహనాలను బస్టాండ్‌కు వెళ్లాలని సూచించాం. ట్రక్కులు, చిన్న వాహనాలను ఇక్కడ నిలిపివేస్తున్నారు. వాతావరణం మెరుగుపడిన వెంటనే లేదా రోడ్డు సలహా ఎత్తివేసిన వెంటనే, చర్యలు తీసుకుంటాము" అని సబ్ ఇన్‌స్పెక్టర్ (SO ట్రాఫిక్) మక్బూల్ హుస్సేన్ అన్నారు.