Meta and Google With Reliance : ప్రపంచవ్యాప్తంగా AI హవా నడుస్తోంది, పెద్ద కంపెనీలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. శుక్రవారం నాడు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో గూగుల్ -మెటా భారతీయ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రిలయన్స్, గూగుల్- మెటా భాగస్వామ్యం కింద, సామాన్య ప్రజలతోపాటు వ్యాపారాల కోసం కూడా AIని సిద్ధం చేయనున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

జుకర్‌బర్గ్ సూపర్ ఇంటెలిజెన్స్ విజన్‌ 

మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ సూపర్ ఇంటెలిజెన్స్ విజన్‌ను పంచుకున్నారు. "ఇది కంపెనీ ఓపెన్ సోర్స్ AI మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. AI సిస్టమ్‌లు ఇప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటున్నాయి అని ఆయన అన్నారు. దీనివల్ల సూపర్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఉన్న సిస్టమ్‌లను మెరుగుపరుస్తుంది. మనం ఊహించలేని విషయాలను కూడా చేయగలుగుతామనిపిస్తుంది. సూపర్ ఇంటెలిజెన్స్ సాధికారతకు కొత్త శకం ప్రారంభించగలదని ఆయన అన్నారు. రిలయన్స్‌తో మెటా భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, రెండు కంపెనీలు భారతీయ వ్యాపారాల కోసం తమ ఓపెన్ సోర్స్ AI మోడల్‌ను తీసుకువస్తాయని అన్నారు.

AIని స్వీకరించడంలో సహాయం చేస్తుంది గూగుల్- పిచాయ్

సమావేశంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, AI విప్లవంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని, కంపెనీ దాని డిజిటల్ భవిష్యత్తు కోసం పని చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. గూగుల్‌కు భారతదేశం ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ఇక్కడ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన వ్యాపారాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, అపారమైన ఆకాంక్షలు ఉన్నాయని ఆయన అన్నారు. గూగుల్ రిలయన్స్, జియోతో కలిసి భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో పెట్టుబడి పెడుతోందని పిచాయ్ అన్నారు. ఈ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల కోట్లాది మందికి చౌకైన ఇంటర్నెట్‌ను అందించడంలో సహాయపడింది. 

ఇప్పుడు AI వంతు- పిచాయ్ 

పిచాయ్ తన ప్రసంగంలో, ఇప్పుడు AI వంతు వచ్చిందని, రెండు కంపెనీల భాగస్వామ్యం చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద కంపెనీల వరకు మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. గూగుల్ AIని స్వీకరించడంలో భారతదేశానికి సహాయం చేస్తుందని ఆయన అన్నారు. రిలయన్స్‌తో కలిసి జామ్‌నగర్ క్లౌడ్ రీజియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇది ప్రత్యేకంగా రిలయన్స్ కోసం తయారు చేసింది. AI -కంప్యూటింగ్‌లో కంపెనీకి సహాయం చేస్తుంది.