Kurla Building Collapse: మహారాష్ట్రలో ఎడతెరిపిలేని వర్షాల ధాటికి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి.






సహాయక చర్యలు


ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. సమాచారం తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్, బీఎంసీ, ముంబయి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 






ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.


పరిహారం




ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది ప్రభుత్వం.


Also Read: ONGC Chopper: అరేబియా సముద్రంలో పడిపోయిన ONGC చాపర్- నలుగురు మృతి


Also Read: ED Summons Sanjay Raut: సంజయ్‌ రౌత్‌కు మరో షాక్- ఆ కేసులో మరోసారి ఈడీ సమన్లు