Army Dogs: ఇండియన్ ఆర్మీలో శునకాలు కూడా ఒక భాగం. తమ సైన్యంలో కుక్కలను కూడా భారత సైన్యం చేర్చుకుంటుంది. వీటి కోసం రిక్రూట్ మెంట్ కూడా నిర్వహిస్తుంది. ఎంపికైన శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు గుర్తించేలా వీటిని తయారుచేస్తారు. ఇప్పటి వరకు ఇలా ఎన్నో శునకాలు దేశానికి తమ సేవలను అందించాయి. దేశం కోసం సేవ చేసిన వాటికి ర్యాంకులు కూడా ఇస్తారు. సైన్యం ఎక్కువగా లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ షెపర్డ్ జాతి కుక్కలను ఆర్మీలోకి తీసుకుటుంది.
దేశసేవలో అమరులైన శునకాలు ఉన్నాయి. అయితే కొన్ని శునకాలు కొంతకాలం తర్వాత సైనికుల మాదిరిగానే రిటైరవుతాయి. అలా విధుల నుంచి రిటైైర్ అయిన శునకాలను ఏం చేస్తారు? శిక్షణ సమయంలో కుక్కలను చాలా రకాలుగా ట్రైన్ చేస్తారు. ఈ ట్రైనింగ్‌లో దేశానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా వాటికి తెలుస్తాయి. మరి అలాంటప్పుడు ఆ శునకాలు రిటైరయ్యాక శత్రువుల చేతికి చిక్కితే? ఏంటీ పరిస్థితి అనే అనుమానం ఉంది. అందుకే దేశానికి సేవలందించి రిటైరైన కుక్కలను భారత సైన్యం చంపేస్తుందనే పుకార్లు చాలాానే ఉన్నాయి. ఇంటర్నెట్ లో చాలా నివేదికలు కూడా ఇలానే పేర్కొన్నాయి. సైన్యంపై కూడా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిని అమానవీయ ఘటనగా చాలామంది పేర్కొంటున్నారు. అయితే నిజంగా సైన్యం అలా చేస్తుందా.. సేవలు ముగించి రిటైర్ అయిన శునకాలను చంపేస్తుందా! ఇందులో ఎంత నిజం ఉంది!
అందుకే అలా..
గతంలో దేశసేవలో పాల్గొని రిటైరైన శునకాలను భారత సైన్యం చంపేసేది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని సైన్యం ఇలా చేసేది. ఎందుకంటే అవి రిటైరన్నప్పటికీ ఆర్మీ రహస్యాలు వాటికి తెలిసి ఉంటాయి. ఆ కుక్క శత్రువుల చేతికి చిక్కితే దేశ రహస్యాలు వారికి తెలిసిపోతాయి. కాబట్టి రిటైరైన తర్వాత అవి ఎవరి చేతికి చిక్కకుండా ఇండియన్ ఆర్మీ అలా చేసేది. అలాగే దేశ సేవలో తీవ్రంగా గాయపడి, నయంకాని వ్యాధితో బాధపడుతున్న కుక్కలను మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపేసేవారు. అయితే 2015 తర్వాత భారత సైన్యం రిటైరైన కుక్కలను చంపడంలేదు. అలాగే మెర్సీ కిల్లింగ్ ను ఆపేసింది.
మరి ఆర్మీలో పదవీ విరమణ తర్వాత శునకాలను ఏం చేస్తారు?
రిటైర్ మెంట్ తర్వాత ఆర్మీ కుక్కలను కుక్కల కోసం ప్రత్యేకంగా ఉన్న మీరట్ లోని ఆశ్రమాలకు పంపుతారు. అలాగే గుర్రాలను ఉత్తరాఖండ్ లోని హేంపూర్ ఆశ్రమానికి పంపుతారు. అక్కడ వాటిని ప్రత్యేక శ్రద్ధతో చూస్తారు. వయసు మీద పడి అవి చనిపోయేవరకు సంరక్షిస్తారు.