Kerala Transgender Couple: దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు అయ్యారు. అంటే ఏదో బిడ్డను దత్తత తీసుకుని వీళ్లు తల్లిదండ్రులు కాలేదండీ. సరోగసి పద్ధతిని సైతం వారు పాటించలేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ (జహాద్) గర్భవతిగా మారి బుధవారం నాడు ఓ పండంటి బిడ్డకు జన్మిచ్చారు. అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉండగా.. మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నామని ఆ జంట వెల్లడించినా.. కొన్ని వైద్య కారణాల వల్ల డాక్టర్లు సర్జరీ చేసి డెలివరీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జహాద్, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.
కొన్ని అవయవాలు మాత్రం లింగ మార్పిడి పూర్తి కాలేదు
జహాద్ (23), జియా పావల్ (21) కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ జంట. జహాద్ ఇటీవల మహిళగా మారగా.. కొన్ని అవయవాలు మాత్రం లింగ మార్పిడి పూర్తి కాలేదు. జహాద్ స్తనాలను ఇప్పటికే సర్జరీ చేసి తొలగించారు. కానీ అండాశయం లాంటి కొన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు కావాలని ఉందని జియా పావల్ భావించింది. ఈ విషయాన్ని చెప్పగా జహాద్ అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్ జహాద్ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడం దేశంలో హాట్ టాపిగ్ గా మారింది. జహాద్ పార్ట్ నర్ జియా పావల్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మాకు మద్దతు తెలిపిన వారికి, తమ శ్రేయస్సు కోరిన అందరికీ, మెస్సేజ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను తల్లి కావాలని ఎలా కలలు కంటానో, అదే విధంగా అతను (జహాద్) తండ్రి కావాలని కలలు కంటున్నాడని చెప్పుకొచ్చింది.
జియా పావల్ క్లాసికల్ డ్యాన్స్ టీచర్ గా చేస్తుండగా.. జహాద్ ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా చేసి మానేశాడు. అయితే గర్భం దాల్చిన కొన్ని నెలలకు జాబ్ మానేసినట్లు తెలిపారు. తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వంగానీ, లింగ మార్పిడి సంఘాలు తమకు అండగా నిలవాలని సహాయం కోసం ఈ దంపతులు ఇటీవల అభ్యర్థించారు. ఇటీవల జహాద్ బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ట్రాన్స్ జెండర్ జంట విషయం అందరికీ తెలిసింది. కొందరు వీరికి మద్దతు తెలపగా, మరికొందరు నెటిజన్లు భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రశ్నల వర్షం కురిపించారు.
స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తర్వాత కూడా గర్భం.. ఎలా సాధ్యం?
ట్రాన్స్ జెండర్ల జంట తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా... తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు.