Kerala High Court has directed the courts not to use Artificial Intelligence tools to issue orders
తిరువనంతపురం: కోర్టు తీర్పులు ఇవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఉపయోగించవద్దని కేరళ హైకోర్టు రాష్ట్రంలోని కోర్టులను ఆదేశించింది. కేసు విచారణలో ఉత్తర్వులు జారీ చేయడానికి కోర్టులు, న్యాయ అధికారులు, ఇతర అధికారుల విషయంలో హైకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. చాట్‌జిపిటి వంటి క్లౌడ్-ఆధారిత AI టూల్స్‌ను తీర్పులు, ఉత్తర్వులు జారీ చేయడానికి ఉపయోగించరాదని కేరళ హైకోర్టు ఆదేశించింది. తమ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సైతం స్పష్టం చేసింది. తీర్మానాలను చేరుకోవడానికి, ఆదేశాలు లేదా తీర్పులను జారీ చేయడానికి AI సాధనాలని ఉపయోగించరాదని కేరళ హైకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
AI Tools మీద సరైన శిక్షణ ఇవ్వాలి
AI టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు లోపాలు తలెత్తుతాయి. కనుక ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ టూల్స్ వినియోగించకుండా జాగ్రత్త వహించాలని హైకోర్టు ఆదేశించింది. ముందుగా AI సాధనాలను ఉపయోగించడంలో సరైన శిక్షణ పొంది ఉండాలి. ఏఐ టూల్స్ వాడితే తప్పులు జరగవు అని తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం, జ్యుడిషియల్ అకాడమీ లేదా హైకోర్టులో జరిగిన శిక్షణా కార్యక్రమానికి న్యాయమూర్తులు, లాయర్లు, న్యాయ అధికారులు హాజరు కావాలి. అమోదం పొందిన AI సాధనాలను త్వరలోనే వినియోగించే అవకాశం ఉంది.
ఏఐ టూల్స్ లో తప్పిదాలు గుర్తిస్తే ఏం చేయాలి..
ఉత్తర్వులు, తీర్పుల కాపీలో ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారంటే ప్రతి దశలో వాటిపై పర్యవేక్షణ ఉండాలి. అనుమతి ఉన్న AI సాధనాల్లో ఏదైనా తప్పిదం జరిగినట్లు గమనించినట్లయితే, హైకోర్టు ఐటి విభాగానికి సమాచారం ఇవ్వాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ఒక హైకోర్టు ఇతర కోర్టులు, న్యాయమూర్తులకు తీర్పులు, ఉత్తర్వులు జారీ చేయడంలో ఇలాంటి సూచనలు ఇవ్వడం ఇదే మొదటిసారి.
Also Read: PM Kisan Samman Nidhi: త్వరలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన నగదు, ఈ 2 పనులు వెంటనే పూర్తి చేయండి