టెకీలకు కేరళ  ( Kerala ) ప్రభుత్వం 'చీర్స్' చెప్పింది. కేరళలోని ఐటీ పార్కుల్లో పబ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఐటీ పార్కుల్లో ( IT PARKS )  పబ్‌లు, వైన్ పార్లర్లు ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని... ఐటీ పార్కులు, టౌన్లలో సోషల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లేనందున ఐటీ కంపెనీలు అంతగా మొగ్గుచూపడం లేదని ప్రభుత్వానికి పలు నివేదకలు అందాయని గతంలో సీఎం పినరయి విజయన్  ( CM Pinarai Vijayan ) అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే అప్పట్లో కోవిడ్ ముప్పు ఉన్నందున నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త లిక్కర్ పాలసీ ప్రకటనలో భాగంగా అనుమతులు ఇస్తున్నట్లుగాప్రకటించారు.


విడాకులు ఇచ్చేస్తే ఏమైపోవాలి ? కోర్టుకెళ్లి భరణం తెచ్చుకున్న భర్త !


ఏడాది లిక్కర్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో పబ్‌లు, మైక్రోబ్రెవరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   పరిశ్రమలు, ఉద్యోగ సంస్థల నిరంతర అభ్యర్థనల మేరకు ఐటీ పార్కుల్లో పబ్‌లను అనుమతించినట్లు ప్రభుత్వం ( Kerala Governament ) తెలిపింది. కేరళ, తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లోని మూడు ఐటీ పార్కుల్లో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. పర్యాటక ప్రచార కేంద్రాలు, సదస్సులు, ఈవెంట్‌ కార్యక్రమాలలో మద్యం  అమ్మేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.  అనేక కార్పొరేట్ సంస్థలు తరచుగా సముద్ర బ్యాక్ వాటర్ పర్యాటక స్థలాల్లో వాటి వార్షిక సమావేశాలను నిర్వహిస్తాయి. అక్కడ వారికి మద్యం అందుబాటులో ఉండకపోవడం మైనస్ అవుతోంది. 


పెళ్లి చేయని కుమార్తెకు పెళ్లి ఖర్చులు ఇవ్వాల్సిందే - ఓ తండ్రికి చత్తీస్‌ఘడ్ కోర్టు ఆదేశం !


అలాగే కేరళలో పండే  జీడిపప్పు, పైనాపిల్, టాపియోకా నుండి తక్కువ-కంటెంట్ ఆల్కహాల్ ఉత్పత్తి కోసం కొత్త బ్రూవరీలను కూడా ప్రారంభించేందుకు కొత్త పాలసీ ( New Policy )  అనుమతి ఇస్తుంది.కేరళలో తొలి వాణిజ్య వైన్ తయారీ యూనిట్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది.  కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆలిండియా వైన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో బుధవారం రెండో విడత చర్చలు జరిపింది. పాలక్కాడ్ లేదా కన్నూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంట్‌కు అసోసియేషన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ ప్లాంట్‌ ఏడాదిలో లక్ష లీటర్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అరటి, పైనాపిల్, జీడి యాపిల్ మరియు జాజికాయ పండ్ల నుండి ఉత్పత్తి ప్రారంభించనున్నారు.