Jammu and Kashmir:
జమ్ముకశ్మీరులోని ఓ కశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు. బుద్గాం జిల్లాలోని చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ అనే వ్యక్తి గుమస్తాగా పని చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.
ఇదీ జరిగింది
ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై గురువారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.
పోలీసులు అలర్ట్
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు.
Also Read: Sedition Law: రాజద్రోహం చట్టం గురించి తెలుసా? అభియోగాలు మోపిన కేసుల్లో నిరూపణ అయినవి ఇంతేనా!