తన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని సోమవారం సాయంత్రం డీకే శివకుమార్ అన్నారు. కానీ అంతలోనే ఆయన మార్చడంతో కర్ణాటక కొత్త సీఎం రేసుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ఈరోజు తన పుట్టినరోజు కనుక కుటుంబంతో గడపాలని బెంగళూరులోనే ఉన్నానని చెప్పిన డీకే శివకుమార్.. రాత్రికి ఢిల్లీకి బయలుదేరతా అన్నారు. కానీ తాను ఈరోజు ఢిల్లీకి వెళ్లడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. 


తాను అనారోగ్య సమస్యలతో ఢిల్లీకి ఈరోజు వెళ్లడం లేదని తెలిపారు. సాయంత్రం జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అందరూ ఎమ్మెల్యేలను గెలిపించానని, తనతో 135 ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న డీకే శివకుమార్ అన్నారు. రాత్రి మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. తనతో ఎమ్మెల్యేలు ఎవరూ లేరని, సీఎంగా ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, తాను ఒంటరిని అంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో సీఎం రేసు మరింత రసవత్తరంగా మారింది.  






గత అయిదేళ్లలో కర్ణాటకలో గానీ, పార్టీలోగానీ ఏం జరిగిందన్నది కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పనన్నారు. సిద్ధరామయ్యను, తనను పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెప్పారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన సమయంలోనూ ధైర్యాన్ని కోల్పోలేదు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది పార్టీ అధిష్టానానికి చెప్పాలనుకోవడం లేదున్నారు. సింగిల్ మెన్ నుంచి కాంగ్రెస్ ను మెజార్టీ సాధించే దిశగా నడిపించలని నమ్మాను. కర్ణాటకలో అదే జరిగిందంటూ శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులతో బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లో శివకుమార్ సమావేశమయ్యారు.


135 మంది ఎమ్మెల్యేలను నేనే గెలిపించా! డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజకీయం గంట గంటకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకూ మాజీ సిద్ధరామయ్యతో కలిసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తొలిసారి కాస్త ధిక్కార స్వరం వినిపించారు. తన నాయకత్వంలోనే 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటూ సోమవారం సాయంత్రం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసుని సైతం చెప్పారు. 


జాతీయ మీడియా ఏఎన్ఐతో సోమవారం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పుట్టినరోజు కావటంతో అభిమానులు, కుటుంబసభ్యులతో గడిపేందుకు ఢిల్లీకి వెళ్లడం ఆలస్యం చేశానన్నారు. ఏఐసీసీ అగ్రనేతల ఆహ్వానం మేరకు తాను సోమవారం రాత్రికి ఢిల్లీ వెళ్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. ఇప్పటికే సిద్ధరామయ్య కూడా ఢిల్లీ చేరుకోగా.. ఇప్పుడు డీకేశీ కూడా హస్తినకు వెళ్తుండటంతో కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరుకోనుంది.