DK Shivakumar Karnataka CM Challenges: కర్ణాటకలో పాలనలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ చేపట్టిన ప్రక్రియ ప్రస్తుతానికి సజావుగానే సాగుతోంది. ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్‌గా పేరు ఉన్న సిద్దరామయ్య తన పదవికి సైలెంట్‌గా రాజీనామా చేసి కుర్చీని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు ఓకే చెప్పారు. జూన్ 3వ తేదీనకర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు డీకేను చాలా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకే వాటిని ఎలా పరిష్కరించుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఘనంగా ప్రమాణ స్వీకారం
దొడ్డాలహళ్లి కెంపేగౌడ శివకుమార్(DKS) తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఎదిగిన ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న శివకుమార్ పాలన ఎలా ఉంటుందనే ఆసక్తి అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం జూన్ 3నబెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తారు. ప్రియాంక కూడా వస్తున్నారని సమాచారం. వీరితోపాటు వివిధ రాష్ట్రాల సీనియర్ లీడర్లు కూడా హాజరుకానున్నారు.
డీకే తోపాటు పది మంది ప్రమాణం
డీకే శివకుమార్‌తోపాటు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మిగిలిన వారిని జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటి నుంచే రొటేషన్ సీఎం ఫార్ములాపై చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య దాదాపు మూడేళ్లు పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు అధికారి మార్పిడి సజావుగా జరగడానికి సిద్ధరామయ్య మే 28న రాజీనామా చేశారు. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు లేదా రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు సమాచారం. తన రాజీనామా తర్వాత డీకే శివకుమార్ స్పందిస్తూ,,, వేగంగా నడవాలంటే ఒంటరిగా వెళ్లాలి, కానీ సుదూరం వెళ్లాలంటే కలిసి నడవాలి. అనే సామెతను గుర్తు చేస్తూ సిద్ధరామయ్యకు ధన్యవాదాలు తెలిపారు.
ఎవరు ఈ డీకే శివకుమార్?
1962మే 15న కనపురలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డీకే శివకుమార్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1989లో 27 ఏళ్ల వయసులోనే సాతనూరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. అప్పటి నుంచి 8 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 1, 413 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. ఇందులో 1,140 కోట్ల రూపాయల చరాస్తులు, 273 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. గజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటంలో కానీ, మహారాష్ట్రలో విలాస్రావు దేశ్‌ముక్ ప్రభుత్వాన్ని నిలబెట్టంలో కానీ, డీకే శివకుమార్ పోషించిన పాత్ర ఆయనను కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా మార్చింది.
డీకే ముందు ఉన్న సవాళ్లు ఏంటీ?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ ఐదు ప్రధాన సవాళ్లు ఎదుర్కోవాలి. సిద్ధరామయ్య వర్గం, తన సొంత వర్గం , వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ మంత్రులను ఎంపిక చేయడం మొదటి సవాలు. సిద్ధరామయ్య నిర్మించిన మైనారిటీ, వెనుకబడిన తరగతులు, దళిత ఓటు బ్యాంకును కాపాడుకోవడం డీకేకు అత్యంత ముఖ్యం. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలకు ఏడాదికి దాదాపు 51వేల కోట్లు ఖర్చు అవుతుంది.ఈ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా చూడటం కత్తి మీద సామే.
కావేరి నదిపై మేకెదాటు డ్యామ్ నిర్మాణం కోసం డీకే శివకుమార్ తీవ్రంగా శ్రమించారు. దీని కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని డీల్ చేయడం చాలా అవసరం. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డీకే, నగరం కోసం టన్నెల్ రోడ్డు, బిదాది ఏఐ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ప్లానే చేశారు. వీటికి నిధులు సమకూర్చడం ఆయనకు పెద్ద టాస్క్.వీటి అన్నింటి కంటే ముఖ్యం వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత రాకుండా చూడటం ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేకతను దాటి పనులు చేయడం ఆయనకు అతి పెద్ద సవాల్. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి వీటిని ఎలా పరిష్కరించి వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి కాంగ్రెస్‌ను తీసుకువస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో ఇప్పుడు డీకే మార్క్ పాలన మొదలవుబోతోంది. ట్రబుల్ షూటర్‌గా పార్టీని గట్టెక్కించిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ తీరానికి చేరుస్తారో చూడాలి.
