Karnataka Government Formation: కర్ణాటక(Karnataka)లో విజయం సాధించి మూడు రోజులు గడుస్తున్నా సీఎం పదవిపై కాంగ్రెస్(Congress) తేల్చలేకపోతోంది. రేపు(బుధవారం) ప్రమాణ స్వీకారం జరబోతుందని ప్రకటించినప్పటికీ ఇంత వరకు సీఎం(Karnataka CM) ఎవరు అనేది స్పష్టత లేకుండా పోయింది. ఈ పదవికి నలుగురు పోటీ పడినప్పటికీ ఇద్దర్ని ఈజీగా పక్కనపెట్టింది హైకమాండ్. మరో ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవడానికి తలలు బద్దలు కొట్టుకుంటోంది. వాళ్లిద్దరే సిద్దరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్(DK Shiva Kumar). వీళ్లిద్దరిలో ఎవర్ని సీఎంగా ప్రకటించే రెండో వ్యక్తి ఎలాంటి పంచాయితీ పెడతారో అన్న టెన్షన్ కాంగ్రెస్ అధిష్ఠానంలో స్పష్టంగా కనిపిస్తోంది. 


ఇప్పుడు వీళ్లిద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం జుట్టు పీక్కుంటుంది. ఇద్దర్నీ ఢిల్లీ పిలిచి మాట్లాడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య తనకు అనుకూలంగా నిర్ణయం ఉండేలా పావులు కదుపుతున్నారు. ఇవాళ డీకే శివకుమార్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 


Also Read: బ్యాగులో కొడుకు శవం, అలాగే 200 కి.మీ.బస్సులో ప్రయాణం - కన్నీరు పెట్టించే ఘటన


ఢిల్లీ బయల్దేరి వెళ్లే ముందు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధిష్ఠానానికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించానని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం టాస్క్ పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు సీఎం పదవి ఇవ్వాలా... వద్దా అన్నది పూర్తిగా అధిష్ఠానం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. అలాగని తనకు పదవి ఇవ్వలేదని వెన్నుపోటు పొడిచే పనులు మాత్రం చేయబోనని తెలిపారు. తనకు సోనియా గాంధీ రోల్ మోడల్ అని అన్నారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒప్పుకుంటానని చెప్పారు. 






సిద్దరామయ్య ప్రజలకు, రాష్ట్ర పార్టీ నాయకులకు దగ్గరగా ఉండే మనిషి అయితే... డీకే శివకుమార్‌ పార్టీ అధినాయకత్వానికి బాగా కావాల్సిన వ్యక్తి. ఓటమి అనేది లేకుండా గెలుస్తున్న వ్యక్తి. ఎమ్మెల్యేపై గట్టి పట్టున్న  పీసీసీ ప్రెసిడెంట్. అందుకే ఇద్దరికీ అంగీకారమయ్యేలా నిర్ణయం తీసుకోవాలని రకరకాల ప్రతిపాధనలను వారి ముందు కాంగ్రెస్ ఉంచుతోంది. అయినా సమస్య చిక్కుముడి వీడటం లేదు.   


కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లి అక్కడ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకుందని, బీపీ కూడా అదుపులో ఉందని, అందుకే ఈ రోజు ఢిల్లీకి వస్తున్నానని, ఇక్కడ హైకమాండ్ ను కలిసే యోచనలో ఉన్నానని చెప్పారు.


Also Read: మీ డబ్బు పొరపాటున వేరే నంబర్‌కు వెళ్లిందా? గాభరా పడొద్దు, తిరిగి వస్తుంది