Karnataka BJP Worker Murder: కర్ణాటకలో భాజపా కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. మంగళూరులో మంగళవారం రాత్రి ప్రవీణ్‌ హత్యకు గురయ్యారు. దీంతో పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.


ఇలా హత్య


భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​ (32)పై నెట్టారు ప్రాంతంలో దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.


పౌల్ట్రీ షాప్​ యజమాని అయిన ప్రవీణ్​పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ హత్యకు గల కారణాలేంటి? చేసింది ఎవరు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నిరసనలు


భాజపా కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం సులియా, కడబ, పుత్తూరు సహా పలు తాలూకాల్లో బంద్ జరిగింది. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.


ప్రవీణ్ హత్యపై ఆందోళన చేపట్టిన భాజపా కార్యకర్తలు, నిరసనకారులు.. దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కారుపై దాడి చేశారు. కారును చుట్టుముట్టి ఊపేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.










సీఎం రియాక్షన్


భాజపా కార్యకర్త హత్యను కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ఖండించారు. తమ పార్టీ కార్యకర్తను దారుణంగా చంపిన నిందితుల్ని త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని ట్వీట్​ చేశారు. ఇది ఎవరో కావాలని చేసిన హత్యగా అనుమానిస్తున్నట్లు సీఎం తెలిపారు.


Also Read: National Herald case: 3 రోజులు, 100 ప్రశ్నలు- ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ


Also Read: 5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రం కోసం అంబానీ, అదానీల ఫైట్- తగ్గేదేలే!