National Herald case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మొత్తం 3 రోజుల్లో 12 గంటల పాటు ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు.
విరామం అని చెప్పి
బుధవారం 3 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ ఇంటికి వెళ్లి పోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు సోనియాకు భోజన విరామం ఇచ్చారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణకు రావాలని తొలుత సమాచారం ఇచ్చారు.
అయితే కొద్దిసేపటి తర్వాత విచారణ ముగిసిందని సమాచారం చేర వేశారు. తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. దీంతో సోనియా గాంధీ విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఏమైనా అవసరం వస్తే కార్యాలయానికి రావాల్సి ఉందని ఈడీ అధికారులు చెప్పినట్లు సమాచారం.
100 ప్రశ్నలు
ఇప్పటికే 3 రోజులపాటు సోనియాను అధికారులు ప్రశ్నించారు. మూడు రోజుల్లో మొత్తం 12 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సుమారు 100 ప్రశ్నల వరకు సోనియా గాంధీని.. ఈడీ అడిగినట్లు తెలుస్తోంది.
ఈ నెల 21న 3 గంటలు, మంగళవారం రెండు దఫాలుగా 6 గంటల పాటు ప్రశ్నావళి కురిపించారు. ఇక బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం.ల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
అరెస్ట్
సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు.
Also Read: 5G Spectrum Auction: 5జీ స్పెక్ట్రం కోసం అంబానీ, అదానీల ఫైట్- తగ్గేదేలే!
Also Read: Alappuzha Collector: శ్రీవారికి బాధ్యతలు అప్పగించిన శ్రీమతి కలెక్టర్! క్యా సీన్ హై!