JioTV Plus app 2 in 1 offer : టెలికాం రంగం సంచలనం సృష్టించిన జియో..  ఫైబర్ ఇంటర్నెట్ లోనూ ఎవరూ ఊహించని సంచలన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా జియో టీవీ ప్లస్ యాప్ ను ఆవిష్కరించింది. ఇందులో ఎనిమిది వందలకుపైగా డిజిటల్ టీవీ చానళ్లతో పాటు పదమూడుకుపైగా ఓటీటీలు ఫ్రీగా చూడవచ్చు. ఇందు కోసం జియో ఎయిర్ ఫైబర్ లేదా జియో ఫైబర్ కనెక్షన్ ఉంటే చాలు.                     


అన్ని స్మార్ట్ టీవీల్లోనూ జీయో టీవీ ప్లస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రీచార్జ్ లేదా మరో కనెకన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు చార్జీల మాటే లేదు. జియో టీవీ ప్లస్ ఇండియాలో అతి పెద్ద కంటెంట్ అగ్రిగ్రేటర్ యాప్  గా ఎదుగుగుతోంది. జియో సెట్ టాప్ బాక్స్ ఉన్న వారు.. అన్ని రకాల స్మార్ట్ టీవీల్లో జియో టీవీ ప్లస్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ లాగిన్ ద్వారా మొత్తం కంటెంట్ ను  ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.              
   
జియో టీవీ ప్లస్ యాప్‌లో రిచ్ కంటెంట్                          


ఎంటర్ టెన్ మెంట్ చానళ్లలో అన్ని కీలకమైన చానళ్లు అందుబాటులో ఉంటాయి. ఈటీవీ, స్టార్ ప్లస్, జీటీవీ, కలర్స్ .. న్యూస్ చానళ్లలో ఇండియా టీవీ, ఏబీపీ న్యూస్, న్యూస్ 18, ఆజ్ తక్ సహా కీలకమైన న్యూస్ చానల్స్ అన్నీ చూసుకోవచ్చు. జీ 5, డిస్ని హాట్ స్టార్, జియో సినిమా ప్రిమీియం, ఈటీవీ విన్ సహా పదమూడు ఓటీటీల్లో కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. 


జియో ఎయిర్ ఫైబర్‌ కనెక్షన్ ఉన్న వారిలో ఎలాంటి ప్లాన్ యాక్టివ్ గాఉన్న వారైనా ఈ కంటెంట్ ను ఒక్క యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే జియో పైబర్ పోస్టు పెయిడ్ వినియోగదారుల్లో 599.. ఆ పైన ప్లాన్లు ఉన్న వారికి యాక్సెస్ అవుతుంది. జియో ఫైబర్ ప్రి పెయిడ్ వినియోగదారులు అయితే 999 రూపాయల ప్లాన్ ఉన్నవారికి యాక్సెస్ ఉంటుంది. 


ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ స్టిక్ ల నుంచి యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వచ్చిన సూచనల ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులకు రిచ్ కంటెంట్ ఇవ్వడంతో జియో ఎప్పుడూ ముందు ఉంటుంది.  జియో ఫైబర్ కనెక్షన్ తో ఇంటర్నెట్ తో పాటు ..  శాటిలైట్ టీవీ కనెక్షన్ కూడా ఉండటంతో అదనపు ఖర్చులు వినియోగదారులకు తగ్గుతాయి. ఇప్పుడు ఓటీటీలకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ జియో టీవీ ప్లస్ ద్వారా జియో టీవీ వినియోగదారులకు చాలా ఖర్చు తగ్గుతున్నట్లే అనుకోవచ్చు.