Assembly Election Exit Poll Results 2024: జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం రెండు దశలలో ఎన్నికలు జరిగాయి. రెండో విడత పోలింగ్‌తో బుధవారం నాడు రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలుండగా, కనీస మెజార్టీ రావాలంటే 41 సీట్లు సాధించాలి. నేడు ఎన్నికలు ముగియగానే సర్వే సంస్థలు నిర్వహించే జార్ఖండ్ ఎగ్టిట్ పోల్స్ పై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. సర్వే సంస్థలు మాట్రిస్, టైమ్స్ నౌ - జేవీసీ, పీపుల్స్ పల్స్ జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. 

జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..
టైమ్స్‌ నౌ-జేవీసీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్: జార్ఖండ్ లో ఎన్డీయే కూటమికి ఎడ్జ్ ఇచ్చింది. టైమ్స్ నౌ- జేవీసీ సర్వేలో బీజేపీ కూటమికి 40 నుంచి 44 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్ (I.N.D.I.A) కూటమి 20 నుంచి 40 సీట్లు కైవసం చేసుకోనుండగా, ఇతరులు ఒకట్రెండు స్థానాల్లో నెగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. 

పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఈ సర్వే సైతం జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షాలదే విజయమని చెబుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 46 నుంచి 58 సీట్లు నెగ్గనుండగా, కాంగ్రెస్ (I.N.D.I.A) కూటమి 24 నుంచి 37 స్థానాలు నెగ్గుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇతరులు సైతం  6 నుంచి 10 స్థానాల్లో నెగ్గనున్నారు.

Agencies NDA (BJP+) INDIA (JMM+) Others

Axis My India

25

53

3

Matrize

42-47

25-30

1-4

People Pulse

44-53

25-37

5-9

Times Now JVC

40-44

 30-40

1-1

Poll Diary 

44-53

24-37

6-9

CHANAKYA STRATEGIES

45-50

35-38

03-05

Dainik Bhaskar

37-40

36-39

0-2

P-MARQ

31-40

37-47

1-6

మాట్రిజ్‌ ఎగ్జిట్ పోల్ రిజల్ట్: మాట్రిస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో సైతం బీజేపీ మిత్రపక్షాలదే విజయమని వచ్చింది. జార్ఖండ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 42 నుంచి 47 సీట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని (I.N.D.I.A) కూటమి 25 నుంచి 30 స్థానాల్లో నెగ్గనుందని ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఇతరులు 1-4 సీట్లు నెగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

Also Read: Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!