Good education is a luxury Viral post on Rs 4 lakh school fee:  ఒకటో తరగతి విద్యార్థి స్కూల్ ఫీజు ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు. ఓ మాదిరి స్కూల్‌లోనే ఈ ఫీజు. అక్కడా ఇక్కడా అని కాదు. అన్ని చోట్లా ఇదే బాధ ఉంది. జైపూర్‌కు చెందిన రిషబ్ జైన్ అనే వ్యక్తి తన బిడ్డను వచ్చే ఏడాది ఫస్ట్ గ్రేడ్‌లో చేర్పించాలని అనుకుంటున్నాడు. ఇందు కోసం కాస్త పేరున్న పాఠశాలను సంప్రదించారు. వారిచ్చిన చెక్ లిస్టు చూసి రిషబ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఫీజు ఎంతో కూడా ఉంది. అన్ని రకాల ఫీజులు కలిపితే నాలుగు లక్షలకుపైగానే అవుతోంది మరి. 



Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్


స్కూల్ ఇచ్చిన ఫీజు లిస్టును రిషబ్ జైన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు పిల్లల చదువులు కూడా లగ్జరీగా మారిపోయాయని ఆవేధన వ్యక్తం చేశారు. 



ఇది ఒది ఒక్క రిషబ్ జైన్ ఆవేదన మాత్రమే కాదు.. ప్రతి ఒక్క మధ్యతరగతి తండ్రి ఆవేదన కూడా . అందుకే ఈ పోస్టు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.  ]






Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్


స్కూల్ ఫీజులను నియంత్రించాలని ప్రతి రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ రాష్ట్రం కూడా అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. రకరకాల సిలబస్‌ల పేర్లు చెప్పి విద్యా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ దోపిడీకి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.