Maharashtra Assembly Election Exitpolls : మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి అంతా తమ హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మహారాష్ట్రలో మొత్తం 288 శాసన సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ అన్ని నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహించగా,  నవంబర్ 23న మరాఠా ఓటర్ల తీర్పు ఏంటన్నది వెలువడనుంది. మొత్తం 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మహాయుతి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి మహావికాస్ అఘాడి నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా, నేడు ఓటింగ్ తో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసింది.  ప్రధాన కూటముల అభర్థుల కాకుండా మరో 2,086 మంది ఇండిపెండెట్స్ పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ రిజల్ట్ 
మ్యాట్రిస్ నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహావికాస్ అఘాడి కూటమికి కనిష్టంగా 110 సీట్లు, గరిష్టంగా 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇతరులు 8 నుంచి 10 స్థానాల్లో నెగ్గనున్నారని మాట్రిస్ సర్వేలో తేలింది. బీజేపీ కూటమి 48 శాతం ఓటు షేర్, కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓటు షేరు రానుంది.

PMARQ ఎగ్జిట్ పోల్ లో ఎవరిది హవా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై PMARQ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి 137 నుంచి 157 సీట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడికి 126- 146 సీట్లు వచ్చే అవకాశం ఉందని వచ్చింది. ఇతరులకు 2 నుంచి 8 సీట్ల వరకు రావచ్చు.

సంస్థలు మహాయుతి (BJP+) మహా వికాస్ (Congress+) ఇతరులు
MATRIZE       150-170        110-130 8-10
CHANAKYA STRATEGIES       152-160        130-138 6-8
POLL DIARY       122-186          69-121 12-29
PMARQ       137-157        126-146 2-8
Poll Of Polls 152 126 10

Also Read: Maharastra Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ - మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో వెల్లువెత్తిన చైతన్యం

ఎగ్జిట్ పోల్ 2024 (CHANAKYA Exit Poll 2024): చాణక్య ఎగ్జిట్ పోల్ సైతం మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎడ్జ్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంచనా వేసింది. BJP కూటమికి 47% ఓట్ షేర్ రాగా, 152-160 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మరోవైపు కాంగ్రెస్ కూటమి 42% ఓట్లతో 130 నుండి 138 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

కమలం పార్టీ పెద్దన్నగా ఉన్న కూటమి మహాయుతి తమదే అధికారం అని చెబుతోంది. బీజేపీ, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ, ఏక్‌నాథ్ శిండే ఆధ్వర్యంలోని శివసేన సహా మరో 8 పార్టీలు మహాయుతి కూటమిగా పోటీ చేశాయని తెలిసిందే.  కాంగ్రెస్, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ,  ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన, మరికొన్ని పార్టీలు మహా వికాస్ అఘాడీ కూటమిగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మహారాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలంటే మొత్తం 288 నియోజకవర్గాల్లో సాధారణ మెజార్టీ రావాలంటే కనీసం 145 సీట్లు గెల్చుకోవాలి.