Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతపై సైన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2022 ఆరంభం ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వేర్వేరు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను హతం చేసినట్లు అధికారులు ప్రకటించారు.
63 మంది
మృతి చెందిన 100 మంది ఉగ్రవాదుల్లో అత్యధికంగా 63 మంది నిషేధిత లష్కేర్ తోయిబాకు చెందినవారు ఉన్నారు. మరో 24 మంది జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వేర్వేరు ఆపరేషన్లలో చనిపోయిన ముష్కరుల్లో విదేశాలకు చెందినవారి సంఖ్య 29గా ఉంది.
గతేడాది ఇదే 6 నెలల కాలవ్యవధిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యతో పోల్చితే ఈ ఏడాది చనిపోయినవారి సంఖ్య రెట్టింపుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదేకాల వ్యవధిలో 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇటీవల
జమ్ముకశ్మీర్ పుల్వామాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి.
ద్రబ్‌గామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్ దాదాపు 12 గంటలపాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు.s
కాల్పుల్లో మరణించిన వారిని జునైద్ షీర్గోజ్రీ, ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్‌గా గుర్తించినట్లు కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులేనని, వీరు లష్కరే తోయిబా గ్రూప్‌కు చెందిన వారని పేర్కొన్నారు.
Also Read: National Herald case: రాహుల్ గాంధీని ఈడీ ఏమడిగిందో తెలుసా?- 3 గంటల పాటు విచారణ