New Parliament Building  :  పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారు అయింది.  మే 28,2023 న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టి  తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  2014 మే 26న  భారత ప్రధానిగా మోడీ మొదటిసారిగా  ప్రమాణ స్వీకారం చేశారు.  2020 డిసెంబర్‌లో  ఆయన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా 2021 అక్టోబర్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.  రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో ఈ  కొత్త పార్లమెంట్  ను  నిర్మించారు. దాదాపుగా పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి.   

సమీర్ వాంఖడే దొరికిపోయినట్లే - షారుఖ్ ఖాన్ కుమారుడి కేసులో ఎంత పుచ్చుకున్నారంటే ?

64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలకు  కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి, వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్,  కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. ఇకు ఇందులో  పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా  దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను  పొందుపరచనున్నారు.   పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జూలైలో కొత్త భ‌వ‌నంలో జ‌రిగే అవకాశం ఉంది. 

'మేడ్‌ ఇన్‌ తెలంగాణ' ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ - కొంగర్‌ కలాన్‌ ఫ్లాంట్‌ కోసం భారీ పెట్టుబడి

భవనంలోకి ప్రవేశించడం కోసం ఎంపీలు, వీఐపీలు, సందర్శకులకు విడివిడిగా ద్వారాలు ఉన్నాయని వెల్లడించాయి. పార్లమెంట్‌ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌ నిలుస్తుంది. దేశ ప్రజాస్వామ్య వారసత్వ సంపదను ప్రతిబింబించేలా నిర్మించిన కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో భారత రాజ్యాంగం తాలూకు అసలు ప్రతిని ఉంచుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌తో పాటుగా దేశ ప్రధాన మంత్రుల చిత్రపటాలను పార్లమెంట్‌ భవనంలో ఏర్పాటు చేస్తారు. 

అర్థశాస్త్ర నిపుణుడు, విజ్ఞాన ఖని కౌటిల్యుడి చిత్ర పటంతో పాటుగా కోణార్క్‌లోని సూర్య దేవాలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చక్రం నమూనాను కూడా ఏర్పాటు చేస్తారని వెల్లడించాయి. 64,500 చ.మీ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న పార్లమెంట్‌ భవనంలో 1,224 ఎంపీలు ఆశీనులు కాగలరు. పార్లమెంట్‌ భవనంలో ఒక లైబ్రరీ, అనేక కమిటీల కోసం గదులు, డైనింగ్‌ గదులు ఉన్నాయి. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని రూ.970 కోట్ల అంచనా వ్యయంతో టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్నది.