Aryan Khan Case: 2021 లో ముంబై సమీపంలోని సముద్రంలో క్రూయిజ్ లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడ్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదికారులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి సమీర్ వాంఖడే నేతృత్వం వహించారు. అయితే ఈ కేసులో ఆయన లంచం తీసుకున్నట్లుగా తేలడంతో సీబీై కేసులు నమోదు చేిసంది. ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేరై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను బయటపడేసేందుకు ప్రతిఫలంగా సమీర్ వాంఖడే రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సమీర్ వాంఖడే ప్రోద్బలంతో ఆర్యన్ ఖాన్ కేసులో గోసావి రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. ఈ మొత్తానికి బదులుగా ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఇరికించబోమని హామీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం, సమీర్ వాంఖడే ఈ డీల్ కోసం డబ్బు పరంగా గోసావికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. 18 కోట్లకు గోసావి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతే కాదు గోసవి అడ్వాన్స్ గా రూ.50 లక్షలు కూడా తీసుకున్నాడని సీబీఐ అధికారులు గుర్తింారు. సమీర్ వాంఖడే తన విదేశీ పర్యటన గురించి సరైన సమాచారం ఇవ్వలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తన ఖరీదైన గడియారం, బట్టల గురించి కూడా సరిగ్గా చెప్పలేదని సీబీఐ అధికారులు ఎఫ్ఆర్‌లో పేర్కొన్నారు.
సమీర్ వాంఖడేకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఉన్నాయి.మే 12న సమీర్ వాంఖడేపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని వాంఖడే నివాసంలో 13 గంటలకు పైగా సీబీఐ బృందం ప్రశ్నించింది. వాంఖడే తండ్రి, అత్తమామలు, సోదరి ఇంట్లోనూ సీబీఐ అధికారులు సోదాలు చేశారు. కాగా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే రెండేళ్ల కిందట నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు బదిలీ అయ్యారు. 2021లో ముంబై జోనల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ ఏడాది అక్టోబర్ 2న రాత్రి వేళ ముంబై తీరంలో ఉన్న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో రైడ్ చేశారు. ఆ నౌక నుంచి 3 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల మెఫెడ్రోన్, 21 గ్రాముల గంజాయి, 22 ఎమ్‌డిఎంఎ (ఎక్టసీ) మాత్రలు, రూ.1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పలు గంటలు ప్రశ్నించిన తర్వాత ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చింది. అతడి అరెస్ట్‌కు దారి తీసిన క్రూయిజ్ షిప్ రైడ్‌పై దర్యాప్తు కోసం సిట్‌ను ఎన్సీబీ ఏర్పాటు చేసింది. ఆర్యన్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో తేలింది.