Bharat Gaurav Kashi Darshana IRCTC Package : భారతీయ రైల్వేలకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పథకం కింద ఓ ప్రత్యేక తీర్థయాత్రను ప్రారంభించింది. 'కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శనం(Karnataka Bharat Gaurav Kashi Darshana)' పేరుతో ఈ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సబ్సీడి కూడా అందిస్తుంది. అయితే ఇది కేవలం కర్ణాటక వాసులకేనా? ఎవరైనా వెళ్లొచ్చా? ప్యాకేజ్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


కర్ణాటక ప్రభుత్వం.. IRCTC లిమిటెడ్‌తో కలిసి 09 రోజుల ట్రావెల్​లో భాగంగా వారణాసి, గయా, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ పవిత్ర స్థలాలను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా.. “కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన” పేరుతో ఈ తీర్థయాత్రను అందిస్తున్నారు. 


తీర్థయాత్ర ప్రారంభ తేదీ.. 


కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ దర్శన తీర్థయాత్ర ఆగస్టు 11వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రుళ్లు, 9 రోజులు ట్రావెల్. ఈ ప్యాకేజ్ ద్వారా ప్రతి వ్యక్తికి 22,500 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం టూర్​ ధరపై 7,500 సబ్సీడి కల్పించింది. అయితే మీరు కర్ణాటక వాసులు కాకున్నా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా పూర్తి ప్యాకేజీ అంటే 22,500 చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. 


ప్యాకేజ్​లో కవర్ చేసే ప్రదేశాలు ఇవే.. 


బెంగళూరు నుంచి వారణాసి.. అక్కడి నుంచి అయోధ్య, తర్వాత గయా, అనంతరం ప్రయాగ్​రాజ్ అటునుంచి బెంగళూరు. ఇలా రూట్​ మ్యాప్ ఉంటుంది. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తే.. అక్కడ తులసి మానస దేవాలయం, సంకట్ మోచన అందించే హనుమాన్ దేవాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఆరతిని చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే పవిత్ర స్నానం, గంగా హారతి అనేవి అక్కడ నీటి స్థాయి, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.


అనంతరం అయోధ్యకి తీసుకునివెళ్తారు. అక్కడ రామజన్మభూమి ఆలయాన్ని చూడవచ్చు. తర్వాత గయ.. అక్కడ విష్ణుపాద ఆలయం, మహాబోధి ఆలయం చూడొచ్చు. చివరిగా ప్రయాగ్​రాజ్ చేరుకుని హనుమాన్ ఆలయం, గంగానదిలో పవిత్ర స్నానం చేయవచ్చు. ఇది కూడా నీటిమట్టంపై ఆధారపడి ఉంటుంది. 


ప్యాకేజ్ బెనిఫిట్స్


ఈ ప్యాకేజ్​లో భాగంగా భోజనం, టీలు, హోటల్స్, స్టేయింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి. 3AC క్లాస్​లో రైల్వే ప్రయాణం ఉంటుంది. నాన్ ఏసీ గదుల్లో హోటల్స్​లో స్టేయింగ్ ఇస్తారు. బ్రేక్​ఫాస్ట్, భోజనం, డిన్నర్ అన్ని అందిస్తారు. శాఖాహారం మాత్రమే ఉంటుంది. నాన్​-ఏసీ బస్సులలో సందర్శనా స్థలాలకు తీసుకెళ్తారు. ప్రయాణీకులకు ప్రయాణ బీమా కూడా ఉంటుంది.


అదనపు ఖర్చులు


బోటింగ్ వంటివి చేయాలనుకుంటే ఇవి ప్యాకేజ్​లో కవర్ అవ్వవు. అలాగే ముందుగానే మెనూ ఫిక్స్ చేసేస్తారు కాబట్టి మీరు ఆర్డర్ చేసే సౌలభ్యం ఉండకపోవచ్చు. రూమ్ సర్వీసింగ్​కు ఛార్జ్ చేస్తారు. దర్శన ఖర్చు, ప్రవేశం, స్థానిక గౌడ్స్​ కావాలనుకున్నా అది ప్యాకేజ్​లో కవర్ అవ్వదు. కాబట్టి మీ సౌలభ్యం కోసం ఏమైనా సేవలు తీసుకుంటే వాటికి మీరు ఎక్స్​ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 


మరిన్ని డిటైల్స్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SZKBG37 ఈ పేజ్ని సందర్శించవచ్చు.