మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి రోజున పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. మెట్టుబావిలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. కొంత మందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.


(మరిన్ని వివరాలతో ఈ పేజీ అప్ డేట్ అవుతుంది)






ఇండోర్ కలెక్టర్, ఇండోర్ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో చర్చించారు. తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇండోర్ జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇండోర్ పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు.


మరోవైపు ప్రమాదంపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. తామంతా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. తాను నిరంతరం టచ్‌లో ఉన్నానని, ఇప్పటివరకు 10 మందిని వెలికి తీయగా, మరో 10 మంది లోపలే ఉన్నారు. లోపల చిక్కుకున్న వారందరినీ సవ్యంగానే బయటకు తీసుకువస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. అయితే, ఇప్పటిదాకా ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది.


డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ అంజలి క్వాత్రా మాట్లాడుతూ, "అడ్మినిస్ట్రేషన్ త్వరగా స్పందించింది, ఇది మంచి విషయం." అయితే ప్రతిసారీ మతపరమైన ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్నది పెద్ద ప్రశ్న. మనం ముందుగానే ఎందుకు సిద్ధం చేసుకోకూడదు? ప్రమాదం జరిగిన ప్రదేశం చాలా ఇరుకైన ప్రదేశమైనా ఇప్పటికీ పరిపాలన వేగం చూపింది. స్థానికులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు.


ఆలయంలోని పురాతన మెట్ల బావి పైకప్పుపై ధార్మిక కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారని, ఎక్కువ మంది భారాన్ని మోయలేక ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అదే సమయంలో, మెట్ల బావి నుండి చాలా మందిని పక్కకు తరలించారు. దీంతో పాటు అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.


ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ
ఇండోర్ ప్రమాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం శివరాజ్ నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఇండోర్‌లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని ట్విటర్‌లో రాశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది. నా ప్రార్థనలు బాధిత వారందరికీ మరియు వారి కుటుంబాలకు ఉన్నాయి’’ అని ట్వీట్ చేశారు.