Covid-19 Cases: దేశంలో కోవిడ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన రోజువారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3016 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,396 మంది రోగులు కోలుకున్నారు. అదే సమయంలో, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.73%కి పెరిగింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,41,68,321 కు పెరిగింది.
ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర భేటీ
దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా కొత్త కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న వేళ ఢిల్లీ ప్రభుత్వం గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గోనున్నారు.
గతేడాది ఆగస్టు 31 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కోవిడ్-19 కేసులు బుధవారం 300కి చేరుకోగా, పాజిటివిటీ రేటు 13.89 శాతానికి పెరిగింది. ఢిల్లీలో చివరిసారిగా గతేడాది ఆగస్టు 31న 300కు పైగా కేసులు నమోదయ్యాయి.
గర్భధారణ సమయంలో కోవిడ్ వస్తే పుట్టే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం
ఎండోక్రైన్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో కోవిడ్-19 వచ్చే తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
2019 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో 100 మిలియన్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల దీర్ఘకాలికందా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయన్న సమాచారం ఉంది. "మా పరిశోధనలు కోవిడ్-19కి గురైన గర్భిణీలకు పుట్టిన పిల్లల జీవితంపై ప్రభావం చూపించనుంది. ఇది స్థూలకాయం, షుగర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణం కావచ్చు " అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఎండీ లిండ్సే టీ ఫోర్మాన్ అన్నారు. "గర్భిణీ స్త్రీలు. వారి పిల్లలపై COVID-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం." గర్భధారణ సమయంలో COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన 150 మంది శిశువులను పరిశోధకులు అధ్యయనం చేశారు. తల్లులకు ప్రినేటల్ ఇన్‌ఫెక్షన్ లేని 130 మంది శిశువులతో పోలిస్తే వారు తక్కువ బరువు కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ మార్పులు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.