Supreme Court: రాజకీయ విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం ఆపినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్వేష ప్రంసంగాలు ఓ విష వలయం అని.. రాజకీయాలను మతంలో కలపడం అనేక సమస్యలకు దారి తీస్తుందని వివరించింది. విచ్ఛిన్న శక్తులే ఇలాంటి పను చేస్తున్నాయని పేర్కొంది. ఇది ప్రజస్వామ్యానికి చాలా ప్రమాదం అని.. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఓ మార్గం చూడాలని ధర్మాసనం సూచించింది. ఇటీవలే తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని న్యాయమూర్తులు కె.ఎం జోసెఫ్, బి.వి నాగరత్న ధర్మాసనం గుర్తు చేసింది. టీవీలు, పేపర్లు, సామాజిక మాధ్యమాల వేదికలపై ఇటీవల విద్వేష ప్రసంగాలు ఎక్కువయ్యయాని అభిప్రాయం వ్యకం చేశారు. మత విద్వేషకర వ్యాఖ్యలు చేస్తూ.. గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎంతమందిపై అని కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం..
ఇలాంటి విద్వేషకర వ్యాఖ్యలు చేసే ఎంత మందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. తోటి వారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలు ప్రమాణం చేస్తే బాగుంటుందని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. దివంగత ప్రధానులు జవహార్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి వారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవని గుర్తు చేసింది. విద్వేష ప్రసంగాలపై త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతున్నాటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే కోర్టులకు పని పడుతోందని వ్యాఖ్యానించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉంటే.. దానికి అర్థం ఏంటని ప్రశ్నించింది. రాష్ట్రాలు ఏమో కానీ కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
వీడియో క్లిప్ లు చూడాలని భావిస్తే పిటిషన్ లో చెప్పండి..
కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్ తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్ ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్ని ఒక డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని సూచించింది. తాము వీడియో క్లిప్ లు చూడాలని పిటిషనర్లు భావిస్తే.. అదే విషయాన్ని పిటిషన్ లో చేర్చమని తెలిపింది. అలాగే విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది.