పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటనలు ఇస్తుండడం సహజమే. అందులో తమకు కావాల్సిన భాగస్వామి గురించి వివరిస్తూ ఉంటారు. తమ ఇష్టాఇష్టాలు, లైఫ్ స్టైల్ వంటి అంశాలను అందులో పేర్కొని తమకు కావాల్సిన వధువు లేదా వరుడు కూడా అలాంటి వారై అయి ఉండాలని కోరుకుంటుంటారు. ఇలా చేయడంలో ఏం తప్పులేదు. కానీ.. ఈ వ్యక్తి ఇచ్చిన మ్యాట్రిమోనియల్ ప్రకటన మాత్రం విస్మయం కలిగించేలా ఉంది. మరీ హద్దులు దాటి ఇచ్చిన ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే..
భారత్‌కు చెందిన ఓ వ్యక్తి బెటర్‌హాఫ్.ఏఐ అనే మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్‌లో పెళ్లి కోసం ప్రకటన ఇచ్చాడు. ప్రొఫైల్‌లోని బయో అనే సెక్షన్‌లో తన భాగస్వామి ఎలా ఉండాలనే అంశం గురించి మరీ దారుణంగా ఇలా రాశాడు. ‘‘సంప్రదాయవాద, ఉదారవాద, ప్రోఫెషనల్ లైఫ్ లీడ్ చేసే జీవిత భాగస్వామి కోసం చూస్తున్నాను. ఆమె ఎత్తు 5.2 నుంచి 5.6 మధ్య ఉండాలి. బరువు 105 ఎల్‌బీఎస్ నుంచి 115 ఎల్‌బీఎస్‌కు మించకూడదు. నడుము సైజు, వక్షోజాల సైజు ఇంతే ఉండాలి. ఆమె కచ్చితంగా మేనిక్యూర్, పెడిక్యూర్ చేసుకొని ఉండాలి. దివి నుంచి భువికి దిగి వచ్చినట్లు ఉండాలి. వస్త్రధారణ కూడా 80 శాతం క్యాజువల్, 20 శాతం ఫార్మల్‌గా ఉండాలి. కానీ, మంచంపై పడుకున్నప్పుడు మొత్తం బట్టలు ధరించాలి. నమ్మకం, నిజాయతీ కలిగి ఉండాలి. సినిమాల పట్ల ఇష్టం, రోడ్ ట్రిప్స్, వంటివి ఇష్టం అయి ఉండాలి. కచ్చితంగా కుక్కల పట్ల ఇష్టం ఉండాలి. పిల్లలు అంటే ఇష్టం ఉండకూడదు. భాగస్వామి కచ్చితంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య వారు అయి ఉండాలి.’’ అని సదరు వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్‌లో పేర్కొన్నాడు.
ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ట్వీట్‌లు, కామెంట్లు చేస్తున్న క్రమంలో ఈ ప్రొఫైల్ మ్యాట్రిమోనియల్ సంస్థ బెటర్ హాఫ్.ఏఐకి తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు సంస్థ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇక నెటిజన్లు ఇతణ్ని పిచ్చి తిట్లు తిడుతున్నారు. ఇతను లేడిస్ టైలర్ అయి ఉంటాడని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ మ్యాట్రిమోనియల్ యాడ్ క్రియేట్ చేసిన వ్యక్తి వయసు 15 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఆకతాయి తనంగా ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇప్పుడు మ్యాట్రిమోనీ సంస్థ తీసుకోబోయే చర్యలకు బాధ్యుడు కానున్నాడు.