దేశ డిఫెన్స్ వ్యవస్థలో మరో మైలు రాయి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) మొట్టమొదటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23న మధ్యాహ్నం 12:30 గంటలకు ఒడిశా తీరంలో మిస్సైల్ పరీక్షలు చేపట్టగా విజయవంతమయ్యాయి. ఇది దేశం యొక్క స్వావలంబన సైనిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో కీలక పరిణామంగా నిలవనుంది.
కొనియాడిన DRDOవిజయవంతమైన ట్రయల్ వీడియోను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) Xలో షేర్ చేసింది. ‘స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్స్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిస్సైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)లను అనుసంధానించే బహుళ-లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సొల్యూషన్’గా IADWSను అభివర్ణించింది.
DRDO సైతం ట్రయల్స్ వీడియోలను Xలో షేర్ చేసింది. ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి మిస్సైల్ పరీక్షలు 23 ఆగస్టు 2025న ఒడిశా తీరంలో 12:30 గంటల సమయంలో విజయవంతంగా హిర్వహించారు’ అని పేర్కొంది.
మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్IADWS అనేది అన్ని స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణులు, హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)లను కలిగి ఉన్న మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
ప్రశంసించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ఈ విజయాన్ని ప్రశంసిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Xలో కొనియాడారు. ‘DRDO ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. QRSAM, VSHORADS, అధిక సామర్థ్యం గల DEW లతో కూడిన IADWS ఓ ప్రత్యేకమైన వాయు రక్షణ వ్యవస్థ. ఈ అద్భుతమైన విజయానికి DRDO, భారత సాయుధ దళాలు, డిఫెన్స్ ఇండస్ట్రీని అభినందిస్తున్నా. ఈ టెస్ట్ మన వాయు-రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
హై-స్పీడ్ మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయగల సామర్థ్యంఅత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి మల్టీ లేయర్డ్ వైమానిక కవచంగా రూపొందించిందే IADWS. ముప్పులను QRSAM, VSHORADS క్షిపణులు అడ్డుకుంటాయి. అయితే అధిక-శక్తి లేజర్ DEW డ్రోన్‌లు, క్షిపణులు, హై-స్పీడ్ మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలవి. ఈ వ్యవస్థలు దేశానికి మరింత భద్రతను కల్పించనున్నాయి.
ఈ పరీక్ష ఓ మైలురాయి..దేశ రక్షణ స్వావలంబనకు ముందుకు సాగడంలో విజయవంతమైన ఈ పరీక్ష ఓ మైలురాయి అని అధికారులు అభివర్ణించారు. సమగ్ర మల్టీ లేయర్ వైమానిక రక్షణ వ్యవస్థను ప్రదర్శించడం ద్వారా, దేశం కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడుకునేలా, వైమానిక ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది అని పేర్కొన్నారు.