Bharat Gaurav Train: 'భారత్ గౌరవ్' పథకం కింద కేంద్రం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం షురూ అయింది. కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ శిర్డీకి ఈ రైలు ప్రయాణించనుంది. ఐదు రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఆధునిక హంగులు, అత్యాధునిక వసతులతో ఈ రైలు ప్రయాణం సాగనుంది.
అత్యాధునిక వసతులు
ఆధునిక హంగులతో ఈ బోగీలు తయారుచేశారు. ఎప్పడు కావాలన్న అందుబాటులో వైద్యుడు, రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది ఈ రైలులో ఉంటారు.
రుచికరమైన శాఖాహార వంటకాలు అందజేస్తారు. ప్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, బస్సు వసతులు, ఏసీ బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటులో ఉంచుతారు.
దేఖో అప్నా దేశ్
1100 మంది ప్రయాణికులతో 'దేఖో అప్నా దేశ్' పేరుతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్‌లో ఈ రైలు బయలుదేరింది. 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు ఇది సాయినగర్ శిర్డీకి చేరుతుంది.
తిరుపూరు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా ఈ రైలు వెళ్తుంది. కోయంబత్తూరు నుంచి వెళ్లేటప్పుడు మంత్రాలయం రోడ్‌లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం అయిదు గంటల పాటు ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో సాయినగర్ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్‌కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుంది. వాడి, ధర్మవరం, ఎలహంక, సేలం, ఈరోడ్, తిరుపూరు స్టేషన్లలో ఆగుతుంది.
Also Read: Presidential Election: దీదీకి 'KK' షాక్- రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యత గోవిందా గోవిందా!
Also Read: Congress Protest: 21 గంటలు, 80 ప్రశ్నలు- వరుసగా మూడో రోజూ రాహుల్ గాంధీ విచారణ