Corona Cases: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. కొత్తగా 17 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే 17,336 మందికి వైరస్ సోకగా 13 మంది మృతి చెందారు.






తాజాగా 13,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.19 శాతం ఉన్నాయి.



  • మొత్తం కరోనా కేసులు: 43,362,294

  • మొత్తం మరణాలు: 5,24,954

  • యాక్టివ్​ కేసులు: 88,284

  • మొత్తం రికవరీలు: 4,27,49,056


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 13,71,107 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది. మరో 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Maharashtra Political Crisis: థాక్రే ప్రభుత్వం కుప్ప కూలినట్టేనా, షిండే శిబిరాన్ని ఎవరూ కదపలేరా?


Also Read: Delhi Crime: అమ్మాయి ఫ్లాట్‌కు రమ్మనగానే వెళ్లిపోయాడు, ఆ తరవాత ఏమైందంటే