భారత్ లో కొన్ని రోజులుగా.. కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..16,156 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే దాదాపు 3 వేల కేసులు అదనంగా వచ్చాయి.
ఇటీవల వైరస్ వ్యాప్తి తగ్గింది. రికవరీ రేటు, క్రియాశీల రేటు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి చేరగా, క్రియాశీల కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. కొత్తగా 17,095 మంది కోలుకోగా.. మొత్తంగా 3.36 కోట్ల మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 1,60,989 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 104 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.
దేశంలో..
మొత్తం కేసులు: 3,42,31,809
మొత్తం మరణాలు: 4,56,386
మొత్తం కోలుకున్నవారు: 3,36,14,434
యాక్టివ్ కేసులు: 1,60,989
మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా..
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా వచ్చింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
కొత్త వేరియంట్
నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ నుంచి విడుదల చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కొత్త వేరియంట్ కు చెందిన ఏడు కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభం నుంచి దేశంలో ఈ వేరియంట్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో 1 శాతం శాంపిల్స్‌లో కొత్త డెల్టా ఏవై 4.2 వేరియంట్ కనుగొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావటం ఇప్పుడు మహారాష్ట్ర వాసులను వణికిస్తుంది.
Also Read: Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి