Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే మళ్లీ పెరిగాయి. కొత్తగా 12,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది వైరస్‌తో మృతి చెందారు. తాజాగా 9,862 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.17 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,331,645
- మొత్తం మరణాలు: 5,24,903
- యాక్టివ్ కేసులు: 81,687
- మొత్తం రికవరీలు: 4,27,25,055
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 12,28,291 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,45,99,906 కోట్లకు చేరింది. మరో 3,10,623 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.