INDIA alleance breakup: కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న జాతీయ‌ కాంగ్రెస్ పార్టీ..(National Congress Party) ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టి ఇండియా కూట‌మి(INDIA Alliance)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. బ‌ల‌మైన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని  అంతే బ‌లంగా ఢీ కొట్టేందుకు.. ప్రాంతీయ పార్టీల ద‌న్నుతో ముందుకు సాగి.. విజ‌యం ద‌క్కించుకుని కేంద్రంలో పాగా వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను కూడ‌గ‌ట్టుకుని ముందుకు సాగేందుకు రెడీ అయింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ వ్యూహం బాగానే ఉన్నా.. ఆ పార్టీ అనుస‌రిస్తున్న విధానాలు.. చిన్న చిన్న పొర‌పాట్లు.. కూట‌మిలో పెద్ద చిచ్చునే రాజేస్తున్నాయి.


క‌న్వీర్ విష‌యం నుంచి.. 


కొన్నాళ్ల కింద‌ట ఇండియా కూట‌మి క‌న్వీన‌ర్ విష‌యంలో కూట‌మి పార్టీ జేడీయూ నేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి(Bihar CM) నితీష్‌కుమార్(Nithish Kumar) విభేదించారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అతి క‌ష్టం మీద ఆయ‌న‌ను బుజ్జ‌గించాల్సి వ‌చ్చింది. మొత్తానికి ఇండియా క‌న్వీన‌ర్‌గా ప్ర‌స్తుత ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే(Mallikarjuna Kharge)కే ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక‌, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata  Benarjee) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆమె ఇండియా కూట‌మిపై నిప్పులు చెరిగారు.


తాజాగా.. 


రాహుల్(Rahul) పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నాడ‌ట‌. మా రాష్ట్రానికి ప‌క్క‌నే ఉన్న మ‌ణిపూర్‌(Manipur)లో ప్రారంభించాడ‌ట‌. కానీ, మాకు మాట మాత్ర‌మైనా చెప్పులేదు. ఎక్క‌డో ఉన్న‌వారిని ఆహ్వానించారు. ఏం మేం యాత్ర‌కు ప‌నికి రాలేదా?  లేక మాకు చెప్ప‌కూడ‌ద‌ని అనుకున్నారా?  కానీ, మేం వారికి అవ‌స‌రం. ఈ విష‌యాన్ని వారు గుర్తుంచుకోవాలి అని మ‌మ‌త బుధ‌వారం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంప‌కాల విష‌యంపైనా పైనా ఆమె అదే స్థాయిలో వ్యాఖ్య‌లు సంధించారు.  మొత్తంగా తామే పోరాడ‌తామ‌ని అన్నారు. ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌న్న సంకేతాలు ఇచ్చేశారు.


ఒంట‌రి పోరు


సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వివాదం  మ‌రింత పెరిగి, చివ‌ర‌కు సీఎం బెన‌ర్జీ ఒంట‌రి పోరును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 


చోటు ఇవ్వం: ఆప్‌


ఇక‌, ఇండియా కూట‌మిలో ఉన్న మ‌రో పార్టీ  ఆమ్ ఆద్మీ(Aaam Aaadmi Party). ఢిల్లీ(Delhi), పంజాబ్‌(Punjab)ల‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ కూడా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్(Bhagawanth mann) సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 పార్ల‌మెంటు స్థానాల్లోనూ తామే(ఆప్) ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ కూడా తుది ద‌శ‌కు చేరుకుంద‌ని సీఎం మాన్ చెప్పారు. దీంతో ఇండియా కూట‌మిలో ఉత్త‌రాదికి చెందిన కీల‌క పార్టీలు ఇలా ఒంట‌రి పోరుకు సిద్ధం కావ‌డంతో కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మి స‌ఖ్య‌త‌, క‌లిసి ప‌నిచేసే విష‌యం పై సందేహాలు ముసురుకున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగుతాయో..లేక కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ జోక్యం చేసుకుని బుజ్జగిస్తారో చూడాలి.