Farooq Abdullah: సరిహద్దు పర్యాటకంపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దు పర్యాటకం ప్రోత్సహించడం, ర్యాలు నిర్వహించడం తమాషాలుగా అభవర్ణించారు. కాశ్మీర్ సమస్యపై భారత్‌, పాకిస్తాన్ నిజాయితీగా చర్చలు జరిపే వరకు ఈ తమాషాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.  


సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, లోయ అంతటా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నందున కాశ్మీర్‌లో పరిస్థితి మారిందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ ఇరు దేశాల హృదయాలు స్వచ్ఛంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిస్కారం సాధ్యమవుతుందని శ్రీనగర్ ఎంపీ విలేకరులతో అన్నారు. యుద్ధాలు దేనిని పరిష్కరించలేవని, భారతదేశం, పాకిస్తాన్ స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో సమస్యల పరిష్కారానికి మాట్లాడాలని అబ్దుల్లా అన్నారు. 


కశ్మీర్ సమస్యపై ఇరు దేశాలు నిజాయితీగా మాట్లాడనంత వరకు, (ర్యాలీలు, సరిహద్దు ప్రర్యాటకం) ఈ ప్రదర్శనల తమాషా అప్పటి వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని, కానీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. 


జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొందని ప్రభుత్వ చెబుతోందని దీనిపై మీ ఉద్దేశం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫరూక్ అబ్దుల్లా ఘాటుగానే స్పందించారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి ఉంటే, ఉగ్రవాదం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఎందుకు బుల్లెట్‌లు పేల్చుతున్నారని, సైనికులు, ప్రజలు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. 


జమ్మూ కాశ్మీర్‌లో వాస్తవానికి శాంతి ఉంటే, నిత్యం రక్తపాతం ఎందుకు జరుగుతోందని, చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు వివరిస్తారని అబ్దుల్లా ప్రశ్నించారు. యుద్ధం వల్ల నష్టాలు ఏంటో, దాని ప్రభావాలు ఏంటో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో తెలుసుకోవచ్చన్నారు. 


రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో యూరప్ ఆర్థికంగా నాశనమైపోతోందని, యుక్రెయన్ ప్రజలను ఎవరు చంపుతున్నారు? యుద్ధంతో ఇరు దేశాలు వారు ఏమి సాధిస్తారు? సరిహద్దులను మారుస్తుందా? అంటూ ప్రశ్నించారు.  


అలాగే భారత్, పాకిస్తాన్ యుద్ధం ద్వారా ఏమీ సాధించలేవని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం చర్చలు మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చైనాతో ఇదే విషయంపై 18 సార్లు చర్చలు జరిగాయని, విదేశాంగ మంత్రి స్థాయిలో కూడా చర్చలు జరిగిన విషయాన్ని ఉదహరించారు.  


నియంత్రణ రేఖ (LoC) సమీపంలోని అనేక ప్రదేశాలలో సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పరిపాలన గురించి అడిగిన ప్రశ్నకు అబ్దుల్లా సమాధానమిచ్చారు. సరిహద్దులు తెరవబడాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా పాక్ పరిధిలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని చూస్తామని, అప్పుడు అక్కడ నిజమైన శాంతి ఉందని తాము అంగీకరిస్తాన్నారు.


జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత కేంద్రం అక్కడ శాంతి నింపేందుకు చర్యలు చేపట్టింది. అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.  అయినా తరచూగా పాక్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటోంది. కొన్ని సార్లు సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతోంది. దీనిపై ఎన్‌సీ అధినేత ఫరూక్ స్పందించారు. ఇరు దేశాలు చర్చలు జరపడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని అన్నారు.