ప్రధాని మోదీ సర్కార్ మెయిన్ మోటో ఏంటి..! ఆత్మనిర్భర్ భారత్. అంటే.. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనమే తయారు చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే స్వయం సమృద్ధి సాధించడం. మరీ ఆ దిశగా దేశం ముందుకు వెళ్తుందా..? అంటే లేదనే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే... SIPRI (Stockholm International Peace Research Institute) రిపోర్టు. డిఫెన్స్ రంగంలో ప్రపంచంలోనే అధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచింది.  అంటే.. మేక్ ఇన్ ఇండియా పక్కకు పోయి.. మెుత్తం విదేశాలపైనే రక్షణ రంగం ఆధారపడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రిపోర్టులో ఉన్న మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం


2018 నుంచి 2022 మధ్య కాలంలో ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న  టాప్-5 దేశాల్లో ఇండియా మెుదటి స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా, ఖతర్, ఆస్ట్రేలియా,  చైనాలు ఉన్నాయి. మరోవైపు... ఎక్కువగా ఎగుమతి చేసిన టాప్-5 దేశాలు..  అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు వరుసలో ఉన్నాయి.


రష్యా ఎగుమతి చేసే ఆయుధాల్లో ఎక్కువగా 31శాతం ఇండియానే కొనుగోలు చేసింది. 2018-22 కాలంలో ఫ్రాన్స్ ఎగుమతి చేసిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఇండియాకే వచ్చాయి. 62 కాంబట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 4 సబ్ మెరియన్స్ ఒప్పందాలు  జరిగాయి. 2018 కంటే ముందుతో పోల్చితే ఇది 489 శాతం ఎక్కువ. ఈ లెక్కలతో రష్యా తరువాత ఎక్కుగా ఆయుధాలు మనకు ఫ్రాన్స్ నుంచే వస్తున్నట్లైంది. 


గత పదేళ్లలో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధాలు ఎగుమతి అవుతుంటే.. అందులో 11 మన దేశానికే వస్తున్నాయి. 2022 ఏప్రిల్ లో లోక్ సభలో రక్షణశాఖ మంత్రి ఓ మాట చెప్పారు. Defence Production, Export Promotion Policy -DPEPP లక్ష్యం ఒక్కటే..!రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం. ఇందులో భాగంగా దిగుమతులు తగ్గించి మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతో 2025 నాటికి లక్ష 75వేల కోట్ల టర్నోవర్ సాధించాలి. కానీ, ఆచరణలో మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతులకే ప్రాధాన్యమిస్తోంది.అందుకు ఓ ఉదాహరణే ఈ రిపోర్టు 


ప్రస్తుత పరిస్థితులల్లో ఓ వైపు చైనా..మరోవైపు పాక్.. ఎవరైనా కయ్యానికి కాలు దువ్వొచ్చు. అందుకే వీలైనన్ని ఆయుధాలు సమకూర్చుకుంటున్నామన్నది కొందరి వాదన. మనకు  పాక్, చైనాలతో ముప్పు. అందుకని రష్యాతో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం. కానీ, రష్యా చైనా కు కూడా ఆయుధాలు అమ్ముతోంది. పాక్ కు గత ఐదేళ్లలో 77శాతం ఆయుధాలు చైనానే అమ్మింది. దీనిని ఎలా చూడాలి ..? ఈ ఆక్ పాక్ కరివేపాక్ థియరీ ప్రకారం.. రష్యా ఆయుధాలే ఎక్కువ కొనడం వల్ల లాభమా..? లేదా నష్టమా..? జర ఆలోచించండి


ఇదంతా చూస్తుంటే.. భారీ స్థాయిలో ఆయుధాల దిగుమతి మాత్రం ఆత్మనిర్భర్ భారత్ అసలు లక్ష్యాలకు తూట్లు పొడస్తుందనే చెప్పుకోవచ్చు.
చైనా-పాక్-రష్యా థియరీ ప్రకారం ఇతర దేశాల ఆయుధాలు ఎక్కవగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. కాబట్టి.. స్పీడ్ రిజల్ట్స్ కోసం కాకుండా..DRDO, వంటి సంస్థల R అండ్ D కోసం అధిక నిధులు కేటాయిస్తే.. దేశీయంగా ఆయుధాలు తయారు చేయడమే కాకుండా.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. కావున, ప్రభుత్వ పెద్దలు స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తే బాగుంటుందని ఆర్థిక, రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.