Independence Day 2023: మరో వారం రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానుంది. ఈ జెండా పండుగను ఎలా జరుపుకోవాలా అని చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే ! ప్రతి ఇంటిపై భారత జెండా ఎగువేసేలా ఇండియన్ పోస్టర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి భారతీయుడు జెండా కొనుగోలు చేసేలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో జాతీయ జెండాల విక్రయాన్ని చేపట్టింది. ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగురవేస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ జరుపుకోవడానికి ఇండియా పోస్టాఫీస్ 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ పతాకాన్ని విక్రయించనుంది. ఇందుకోసం ఆగస్టు 13 నుంచి 15 మధ్య ప్రభుత్వం హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత జెండాను ప్రతి ఇంట్లో ఎరుగువేసేలా హర్‌ఘర్‌తిరంగా జరుపుకోవడానికి ఇండియా పోస్టాఫీస్ తన 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ పతాకాన్ని విక్రయించనున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పౌరులు జాతీయ జెండాను ఈపోస్ట్ ఆఫీస్ సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని అని ఇండియాపోస్ట్ తన ట్వీట్‌లో పేర్కొంది. అలాగే ఆఫ్‌లైన్లలో పోస్టాఫీస్‌లొ కొనుగోలు చేయొచ్చని అని ఇండియాపోస్ట్ తన ట్వీట్‌లో పేర్కొంది.
హర్ ఘర్ తిరంగా ప్రచారానికి మద్దతుగా ఇండియా పోస్ట్ ప్రత్యేకంగా జాతీయ పతాకం విక్రయాలను అందిస్తోంది. జెండాలు 20 x 30 అంగుళాల సైజులో అందుబాటులో ఉంటాయి. ఒక్కో జెండా ఖరీదు రూ.25 ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఒకేసారి ఐదు జెండాలు ఆర్డర్ చేయవచ్చని, డెలివరీకి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆర్డర్ చేసిన తర్వాత మళ్లీ క్యాన్సల్ చేయడానికి వీలు లేదు. మీరు ఇచ్చిన అడ్రస్‌కు జెండాను డెలివరీ చేస్తారు. మీకు ఆన్‌లైన్‌లో జెండాలు అందుబాటులో లేకపోతే దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి కొనుగోలు చేయొచ్చు.
కేంద్రం సవరించిన నిబంధనల మేరకు ఇప్పుడు రోజంతా జాతీయ జెండా మన ఇళ్లపై రెపరెపలాడబోతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రజలు జాతీయ జెండాను ఇంటికి తీసుకురావడాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది. ప్రజలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం, భారత జాతీయ జెండా గురించి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఆలోచన.
ఆన్‌లైన్‌లో జెండా కొనుగోలు చేయండి ఇలా
* ముందుగా మీరు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* అందులో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
* లాగిన్ అయ్యాక ప్రొడక్ట్స్ కేటగిరిలోకి వెళ్లాలి. అక్కడ నేషనల్ ఫ్లాగ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
* మీకు ఎన్ని జెండాలు అవసరం ఉందో అన్ని జెండాలను యాడ్ చేసుకోవాలి. గరిష్టంగా 5 జెండాలు మాత్రమే ఎంచుకోగలరు
* ఆ తరువాత బై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. దీన్ని కూడా ఎంటర్ చేయాలి.
* ఇప్పుడు ప్రోసీడ్ టు పేమెంట్‌పై క్లిక్ చేయాలి. ఒక్కో జెండాకు రూ. 25 చెల్లించాలి.