రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ 75 వ స్వాతంత్య్ర దినోత్సవం 2021 indianidc2021.mod.gov.in. (IDC 2021 ) అనే వెబ్‌సైట్‌ను న్యూఢిల్లీలో ఆగస్టు 3 న ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను అనుసంధానించేందుకు ఈ వెబ్‌సైట్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది.  IDC 2021 Mobile Appను కూడా తీసుకురానుంది. 


" స్వాతంత్య్ర వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులందరినీ ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా... ప్రజల్లో ఐక్యతని, మన సంస్కృతిని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అన్నారు అజయ్ కుమార్. న్యూఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని 360 డిగ్రీల్లో వర్చువల్ రియాల్టీ ద్వారా ప్రజలకు చూపించే అవకాశం కల్పిస్తోంది. మొట్టమొదటిసారిగా, ఆగష్టు 15, 2021న వర్చువల్ రియాలిటీ (VR) 360 డిగ్రీ ఫార్మాట్‌లో ఎర్ర కోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ప్రజలు ఈ ఫీచర్‌ని VR గాడ్జెట్‌తో పనిలేకుండా చూడొచ్చు.


ఈ వెబ్‌సైట్ లో IDC రేడియో, గ్యాలరీ, ఇంటరాక్టివ్ ఫిల్టర్‌లు, విన్యాసాలపై e-Books, 1971 విజయానికి 50ఏళ్లు, స్వాతంత్య్ర ఉద్యమం, యుద్ధాలు, యుద్ధ స్తూపాలపై  బ్లాగ్‌లు లాంటి ఫీచర్లు కూడా ఇందులో చూడొచ్చు. ఈ వెబ్ సైట్ లో లాగిన్ అవడం ద్వారా వేడుకలకు సంబంధించిన సమాచారంతో పాటూ... రూట్ మ్యాప్, పార్కింగ్ వివరాలు, RSVP సహా ఇతర కార్యకలాపాల వివరాలను ప్రతి నిముషం ఇందులో తెలుసుకోవచ్చు. వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టే కార్యక్రమాల వివరాలు కూడా ఇందులో చూడొచ్చు.


వెబ్ ఆధారిత RSVP వ్యవస్థ కింద..స్మార్ట్ ఫోన్ ఉపయోగించి QR స్కాన్ స్కాన్ చేసినప్పుడు, ఒక వెబ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు వెబ్ పోర్టల్ లోకి ఎంటరవుతాడు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా స్వంతంత్ర దినోత్సవంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఐడిసి 2021 లో కార్యకలాపాలు.... మహిళల పర్వతారోహణ యాత్ర, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్వహించిన 75 వైద్య శిబిరాలు సహా  దేశవ్యాప్తంగా 75 చోట్ల నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) క్యాడెట్‌లు నిర్వహిస్తున్న కార్యకలాపాలు కూడా ఈ వెబ్ సైట్లొ పొందుపచనున్నాం అన్నారు రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్.


స్వాతంత్య్ర దినోత్సవం… భారతీయులంతా ఆనాటి త్యాగమూర్తులను స్మరించుకుని, వారికి అంజలి ఘటించే రోజు.  భారతీయులందరకీ ఎంతో ముఖ్యమైన వేడుక ఇది. అందుకే ఎక్కడివారు అక్కడే ఉండి వేడుకల్లో పాల్గొనేందుకు ఇదో అద్భుతమైన అవకాశం....